అలనాటి హీరోయిన్ అన్షు(Anshu)పై డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆమెపై ఆయన అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అయ్యారు. మరోవైపు మహిళా కమిషన్ కూడా సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేస్తామని పేర్కొంది. అయితే తాజాగా ఈ వ్యవహారంపై నటి అన్షు స్పందించారు. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు.
చాలా ఉత్సాహంగా..
“అందరికి హలో… ‘మజాకా(Mazaka)’ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్, అందులో నా పాత్రపై మీరు చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాను. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. నాపై ప్రేమ కురిపిస్తూ ఎన్నో మెసేజెస్, కాల్స్ వచ్చాయి. మీడియాకు చాలా థాంక్స్. చాలా తర్వాత నేను మీకు కనిపించినా.. నా గురించి చాలా బాగా మాట్లాడారు. అయితే త్రినాథ్ గారు చేసిన కొన్ని కామెంట్స్ పై అనేక రకాల కథనాలు తెరపైకి వచ్చాయి. దాని గురించి నేను ఓ విషయం చెప్పాలి అనుకుంటున్నాను.
ఆయన చాలా మంచివారు
త్రినాథరావు గారు ఈ భూమి మీద ఉన్న అత్యంత మంచివాడు. ఆయన మాటలను వక్రీకరించారని నాకు అనిపిస్తోంది. ఆయన నన్ను ఓ ఫ్యామిలీ మెంబర్ లా చూసుకున్నారు. నేను ఈ సినిమా కోసం 60 రోజులు పని చేశాను. ఆయన నాకు చాలా గౌరవం ఇచ్చారు. ఎప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఇక ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేద్దాం. ఎందుకంటే.. నేను సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నాకు త్రినాథరావు కంటే మంచి కంబ్యాక్ ఎవరూ ఇవ్వలేరని నేను అనుకుంటున్నాను.” అని అన్షు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.







