టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వారసుడొచ్చాడు. రోహిత్ శర్మ – రితికా సజ్దే మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ దంపతులకు ఇప్పటికే సమైరా అనే కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రితికాను రోహిత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరుకుటుంబాల పెద్దల ఆశీర్వాదంతో 2015, డిసెంబర్ 13వ తేదీన వీరి వివాహం జరగగా.. 2018 డిసెంబరు 30వ తేదీన సమైరా జన్మించింది.
ఇక ఆస్ట్రేలియాతో (AUS vs IND) ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకోగా.. రోహిత్ శర్మ మాత్రం ఇండియాలోనే ఉన్నాడు. రితికా రెండో కాన్పు నేపథ్యంలోనే అతడు ఆస్ట్రేలియాకు వెళ్లలేదనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం రితికా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రోహిత్.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందే ఆ గడ్డపై అడుగుపెట్టే అవకాశముందని క్రీడా వర్గాల్లో టాక్.
అయితే రితికా డెలివరీ విషయంపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు నుంచి తనను మినహాయించాలని రోహిత్ శర్మ బీసీసీఐను కోరగా బోర్డు అంగీకారం తెలిపింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వ్యక్తిగత, కుటుంబ కారణాలతో ఆటగాళ్లు మ్యాచ్‌లకు దూరం కావడం ఇది తొలిసారి కాదు. ఈ నెల 22న ఆస్ట్రేలియాతో జరగాల్సిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి.
The junior hitman has arrived…❤️
Rohit Sharma & Ritika blessed with baby boy.#RohitSharma𓃵 #RohitSharma#RohithSharma #JuniorHitmanpic.twitter.com/b00ctiddHb pic.twitter.com/Nhedd5K2np
— Panda Heart🐼🖤 (@_vy_sh_navi) November 15, 2024






