Nara Rammurthy Naidu : సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి (CM Chandrababu Naidu) సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అనారోగ్య కారణాలతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లారు. 

నారా కర్జూరనాయుడు, అమ్మణమ్మ దంపతుల రెండో కుమారుడు 1952లో రామ్మూర్తినాయుడు (Nara Rammurthy Naidu). తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి సొంత తమ్ముడు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉండగా.. వారిలో ఒకరు నటుడు నారా రోహిత్‌ (Nara Rohit), నారా గిరీష్. 1994లో రామ్మూర్తినాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 వరకు ఆయన ప్రజా సేవలో ఉన్నారు. అనంతరం ఆయన అనారోగ్యంతో రాజకీయాల నుంచి విరమించుకున్నారు. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *