ఐఫా కాంట్రవర్సీపై తేజా సజ్జ క్లారిటీ

 ‘ఐఫా’ అవార్డుల (IFFA Awards) వేడుకలో రానా దగ్గుబాటి (Rana Daggubati) –  తేజా సజ్జ (Teja Sajja) తమ హోస్టింగుతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో వారు చేసిన కొన్ని వ్యాఖ్యలు.. మరికొన్ని జోకులు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని కామెంట్స్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా తేజ క్లారిటీ ఇచ్చారు. 

‘‘ఐఫా వేడుకకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇదో నేషనల్ స్థాయి ఈవెంట్. ఎంతో మంది స్క్రిప్టు రైటర్స్ దీని కోసం వర్క్ చేశారు. అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మాకు స్క్రిప్టు ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలన్నీ కట్ చేసిన క్లిప్స్. ఫుల్ వీడియో చూసుంటే ఇది వివాదాస్పదం (IIFA Telugu Controversy) కాకపోయుండేది.

రానా నాపై జోకులు వేశారు. అందరూ వాటిని జోక్‌గానే చూశారు. చిన్నప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో ఉండటం వల్ల హీరోలతో నాకు మంచి రిలేషన్ ఉంది. నేనెప్పుడు ఇతరులను తక్కువ చేసి మాట్లాడను. మా కామెంట్స్ ను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే ఇది కాంట్రవర్సీగా మారింది.’’ అని తేజ క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు ఇదే విషయంపై రానా దగ్గుబాటి కూడా స్పందిస్తూ.. ‘‘నేచురల్ స్టార్ నాని (Nani) నాకో సలహా ఇచ్చారు. నెక్స్ట్ టైమ్‌ నుంచి జోక్స్‌ వేసినప్పుడు.. అది జోక్‌ అని తెలిసినట్లు వెయమని చెప్పారు. ఇది జోక్‌.. అందరూ నవ్వండి అని నెక్స్ట్‌ టైమ్‌ నుంచి ఒక సబ్‌ టైటిల్‌ వేద్దామనుకుంటున్నాను’’ అని రానా అన్నారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *