Mana Enadu : కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan), నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘అమరన్’ (Amaran). 2014లో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అసువులు బాసిన అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
అయితే తాజగాా తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఈ సినిమా ప్రదర్శితమవుతోన్న ఓ థియేటర్ వద్ద ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్‌పై పెట్రోల్ బాంబులతో దాడి(Petrol Bomb Attack Chennai)కి తెగబడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెట్రోల్ బాంబు దాడులపై థియేటర్ (Amaran Movie Petrol Bomb Attack) యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఈ దాడికి గల ప్రధాన కారణం ఏంటనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని .. స్థానిక గొడవల వల్లే ఈ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Unidentified persons hurled petrol bombs in the campus of Alangar Cinemas in Tirunelveli where #Amaran and #Kanguva movies are screened. pic.twitter.com/ewdMC7nPX0
— Thinakaran Rajamani (@thinak_) November 16, 2024






