IRCTC Vikalp Option: ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేస్తున్నారా? అయితే ఈ ఆప్షన్ ఎంచుకోండి

Mana Enadu: సాధారణ సెలవులు సమయంలోనే ట్రైన్, బస్ టికెట్లు(Train and bus tickets) దొరకడం కష్టం. అలాంటిది పండగల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి తప్పని సరిగా రిజర్వేషన్ టికెట్(
Reservation ticket) ఉండాల్సిందే. లేకపోతే జర్నీలో పడే కష్టం అంతాఇంతా కాదు. ఇక ప్రజెంట్ దీపావళి(Diwali) ఫెస్టివల్‌ కోసం ఇంటికి వెళ్లే వారు ట్రైన్ టికెట్స్ కోసం నానాతంటాలు పడుతున్నారు. అటు రైల్వే శాఖ ఎన్ని స్పెషల్ ట్రైన్స్(Special Trains) నడిపినా ప్రయాణికులకు సరిపోవడం లేదు. అయితే ట్రైన్ టికెట్ల బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్నవారు ఇలా ట్రై చేస్తే టికెట్ కన్ఫార్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేంటో తెలుసుకుందామా..

 టికెట్‌ బుక్ చేసినప్పుడే ఆ ఆప్షన్ ఎంపిక చేయాలి

ప్రయాణికులు IRCTC వికల్ప్ స్కీమ్(Vikalp Scheme) నుంచి కన్ఫార్మ్ రైలు టిక్కెట్‌ను తీసుకోవచ్చు. అయితే టికెట్ బుక్ చేసుకునే ముందే ఒక ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ గురించి చాలా మందికి తెలియదు. IRCTC యాప్‌లో మీకు వికల్ప్ ఆప్షన్ కనిపిస్తుంది. టికెట్‌ బుక్ చేసినప్పుడు ఆప్షన్ స్కీమ్‌ను ఎంచుకుంటే టికెట్ షెడ్యూల్ 12 గంటలలోపు నడుస్తున్న మరొక రైలుకు మారుతుంది. సీటు అందుబాటులో ఉంటే టికెట్ ఆటోమేటిక్‌గా కన్ఫార్మ్(Automatically conform) అవుతుంది. అయితే ఒకసారి మరొక రైలుకు టికెట్ ట్రాన్స్‌ఫర్ అయితే ఆ తర్వాత అసలైన రైలు బుకింగ్‌కు తిరిగి రాలేరు. ఈ ఫీచర్ మెయిల్, ఎక్స్‌ప్రెస్(Mail, Express) రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆప్షన్ ఎంచుకునే వెయిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులు దీని కోసం ఎలాంటి అదనపు ఛార్జీ(No Additional charge)ని చెల్లించాల్సిన అవసరం లేదు.

Related Posts

SCR: ప్రయాణికులకు ఊరట.. 48 స్పెషల్ ట్రైన్స్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) శుభవార్త అందించింది. ఇటీవల రైళ్ల రద్దు, దారి మళ్లింపు, స్టేషన్ల పునర్మిణానం, మూడో లైన్ పనులు, ఇతర స్టేషన్లనుంచి రాకపోకలు అంటూ ప్రయాణికులను(Passengers) విసిగించిన రైల్వే శాఖ(Railway Department) తాజాగా ప్రయాణికులకు కాస్త…

Railway New Fares: రైలు ప్రయాణికులకు షాక్.. అమలులోకి పెరిగిన ఛార్జీలు

దేశ వ్యాప్తంగా రైల్వే ఛార్జీలు(Railway Fares) పెరిగాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ఛార్జీలు(Charges) అమలులోకి వచ్చాయి. రైలు ఛార్జీలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం(Central Govt) నిర్ణయించినట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై అధికారిక ప్రకటన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *