Mana Enadu: ప్రజెంట్ దేశంలో ఫెస్టివల్ సీజన్(Festival season) నడుస్తోంది. మొన్న వరకు రెండు తెలుగు రాష్ట్రాలు బతుకమ్మ, దసరా పండుగలను ఘనంగా జరుపుకున్నారు. ఇంటిళ్లిపాది సంతోషంగా గడిపారు. ఇక ఇప్పుడు దీపావళి(Diwali) సందడి సాగుతోంది. దీంతో నగరాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్లు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే డిపార్ట్‌మెంట్(Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ పండగలకు చాలా ప్రత్యేకత
దేశమంతా ఈ దీపావళి ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల(North state)ల్లో ఛట్‌పూజ, దీపావళి(Chhath pooja and Diwali) పండుగలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఏకంగా 7వేల స్పెషల్ ట్రైన్ల(Special Trains)ను నడపాలని నిర్ణయం తీసుకుంది.ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వే(South Central Railway) పరిధిలో 1400 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఇక నార్త్(North Central Railway) సెంట్రల్ రైల్వే పరిధిలో 3050 స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా అదనంగా మరో 2 లక్షల మంది రైళ్లలో ప్రయాణించవచ్చు.
అయ్యప్ప భక్తుల కోసం ‘భారత్ గౌరవ్’
ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnav) స్పెషల్ ట్రైన్ల వివరాలు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలతో పాటు బిహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల వారికి కూడా లబ్ధి చేకూరబోతుందని అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విశాఖపట్నం, గోరఖ్‌పూర్, అగర్తలా, రక్సౌల్, నాగర్‌సోల్, దానాపూర్, తిరుపతి, నిజాముద్దీన్, సంత్రాగచి, శ్రీకాకుళం వంటి స్టేషన్లు ఉండే రూట్లలో ఈ స్పెషల్ ట్రైన్లు పరుగులు పెట్టనున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని అయ్యప్ప భక్తుల కోసం ‘భారత్ గౌరవ్(Bharat Gourav)’ ట్రైన్‌ను నడపనున్నట్లు IRCTC ప్రకటించింది.