బాబును ఎలా అరెస్టు చేస్తారు..? మంత్రి హరీష్​రావు

హైదరాబాద్: మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం దురదృష్టకరమని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం చంద్రబాబు అరెస్టుపై మంత్రి హరీశ్ రావు తొలిసారి స్పందించారు. ఈ వయస్సులో చంద్రబాబును అరెస్ట్ చేయడం మంచిది కాదన్నారు.తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు తీసుకోవచ్చని మాజీ సీఎం చంద్రబాబు వాస్తవాలు చెప్పడంతోనే అక్కడి సర్కారు అక్కసు వెల్లగక్కిందని విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన బాగుంది కాబట్టే చంద్రబాబు అలా అన్నారని పేర్కొన్నారు.

ఎపిలో స్కిల్ డెవ్ లప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అరెస్టుపై పలువురు ముఖ్య నాయకులు స్పందిస్తూ, ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. పలవురు బిఆర్ఎస్ నాయకులు కూడా ఆయన అరెస్టును ఖండిస్తూ నిరసనలు తెలిపారు. అయితే, ఇటీవల చంద్రబాబు అరెస్టుపై కెటిఆర్ స్పందిస్తూ.. చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు సంబంధం లేదు. ఆంద్రలో పంచాయతీ.. ఆంధ్రలోనే తేల్చుకోవాలని చెప్పడం పట్ల కొన్ని పార్టీలు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

Share post:

Popular