
‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’లో 100 మంది ఉగ్రవాదులు(Terrorists) హతమైనట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈరోజు ఉదయం కేంద్రం అఖిలపక్ష భేటీ(All-party meeting) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్(Defense Minister Rajnath Singh) వెల్లడించారు. పాకిస్థాన్(Pakistan), పీఓకే(POK)లోని ఉగ్రస్థావరాల(Terrorists Camps)పై భారత ఆర్మీ(Indian Army) చేపట్టిన దాడుల్లో 100 మంది మరణించినట్లు రాజ్‌రాథ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
వెనక్కి తగ్గేదిలేదు దీటుగా బదులిస్తాం..
రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ… పాకిస్థాన్, PoKలోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై కచ్చితత్వంతో క్షిపణి దాడుల(Missile attacks)ను నిర్వహించాం. ఈ దాడుల్లో 100 మంది ముష్కరులను మట్టుబెట్టాం. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందున ఈ ఆపరేషన్ తాలూకు పూర్తి సమాచారాన్ని ఇప్పుడే వెల్లడించలేం. ఈ ఉద్రిక్తతలను పెంచాలనే ఉద్దేశం మాకు లేదు. కానీ, పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం… వెనక్కి తగ్గేదిలేదు. దీటుగా బదులిస్తాం. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది అని అన్నారు.
కాగా, ఏప్రిల్ 22న పహల్గామ్(Pahalgam)లో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ బుధవారం తెల్లవారుజామున ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై మెరుపుదాడులతో తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.