మాదాపూర్ డ్రగ్స్ కేసులో (Madhapur Drugs Case) HERO నవదీప్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. నవదీప్‌ను నార్కోటిక్ పోలీసులు న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రశ్నిస్తున్నారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో (Madhapur Drugs Case) HERO నవదీప్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. నవదీప్‌ను నార్కోటిక్ పోలీసులు (Narcotics police) న్యాయస్థానం ఆదేశంతో ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ విక్రేత రామ్‌చందర్‌తో నవదీప్ సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఎవరి వద్ద డ్రగ్స్ కొంటున్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ కేసులో నవదీప్‌ను వినియోగదారుడిగా చేర్చారు. ఆయన ద్వారానే సినీ పరీశ్రమకు డ్రగ్స్ సరఫరా అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నవదీప్‌ను పోలీసులు మాదాపూర్ డ్రగ్స్ కేసులో 37వ నిందితుడిగా చెప్పారు. హీరో ఇంట్లో నార్కోటిక్స్ పోలీసులు సోదాలు చేశారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పోలీసుల విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసుల ముందుకు వచ్చారు.