మన ఈనాడు: తెలంగాణ ఉద్యమంలో క్రీయశీలకంగా పోరాడిన ఉప్పల్ బీఆర్ఎస్ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యమకారులకు పార్టీలో గుర్తింపు లేకపోవడంతో గులాబీ వచ్చిన కొత్త నాయకులను చేసి ఉద్యమకారులను చులకన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గ నాయకులు జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గరిక సుధాకర్ ఆధ్వర్యంలో 100మందికి పైగా సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలోని ఉద్యమకారులను కనీసం గుర్తించడంతోపాటు గౌరవించాలని కోరారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసినవారిలో కొండల్‌రెడ్డి, వనంపల్లి గోపాల్‌రెడ్డి, బండ వినేష్‌రెడ్డి, కొంగల శ్రీధర్, కొంగల నరసింహ, నానాపురం వంశీ, ఎండీ సర్పరాజ్, చందు, అశోక్, గరిక ప్రభాకర్, ఎండీ యూసుఫ్, శ్రీలతయాదవ్, ధనలక్ష్మి, భాగ్యరేఖ, విజయ్‌కిరణ్,నరేష్, యాదగిరి ఉన్నారు.