ఖాకీ ట్రైనింంగ్​ జీవితం నేర్పిస్తుంది..ట్రైనింగ్​ కానిస్టేబుల్​ అభ్యర్థులతో..

మన ఈనాడు:పోలీసు శిక్షణ యొక్క అసలు ఉద్దేశం ఎంపికయిన అభ్యర్థులకు క్రమశిక్షణ నేర్పి పోలీసు శాఖలో చేరిన తర్వాత సమర్థవంతంగా పని చేసేలా తీర్చిదిద్దడమేనని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి పేర్కొన్నారు. ఈ రోజు అంబర్ పేట హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై త్వరలో శిక్షణకు వెళ్లనున్న సెలెక్టెడ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు కమీషనర్ దిశా నిర్దేశం చేశారు.

పోలీసు కానిస్టేబుల్ శిక్షణకు వెళ్ళడం అనేది జీవితంలో ఒక చక్కటి నూతన దశ అన్నారు. శిక్షణలో భాగంగా వివిద ప్రాంతాల శిక్షణా కేంద్రాలకు వెళ్ళే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ శిక్షణలో నేర్పించే అంశాలను క్రమశిక్షణతో, అంకిత భావంతో నేర్చుకోవాలని సూచించారు. శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలల కాలంలో నేర్చుకోబోయే అంశాలు శిక్షణ అనంతరం ఉద్యోగంలో చేరిన తర్వాత తమ విద్యుక్త బాధ్యతల నిర్వహణలో ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

శిక్షణ కేంద్రంలో పరిచయం అయ్యే కొంతమంది కొత్త మిత్రులతో కలిసి శిక్షణ అనంతరం ఒకే చోట పని చేసే అవకాశం ఉందని, కాబట్టి శిక్షణ కేంద్రం అభ్యర్థులకు కొత్త మిత్రులను కూడా అందిస్తుందని పేర్కొన్నారు.

శిక్షణ కాలంలో నేర్పే అంశాలను శ్రద్ధతో, అంకితభావంతో నేర్చుకోవాలని, క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోలీసు శాఖలో చేరి ప్రజలకి సేవ చేయాలనే ఉన్నత లక్ష్యంతో ఎంతో మంది యువతీ యువకులు అహోరాత్రులు శ్రమించి, ఎంతో కఠిన శ్రమతో శారీరక దారుడ్య పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి, కష్టపడి చదివి ఉద్యోగము సాధించడం ద్వారా తమ కలను సాకారం చేసుకున్నారని, అటువంటి ఉన్నత ఉద్యోగంలో అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.

పోలీసు ఉద్యోగం ద్వారా సమాజంలో వివిధ వర్గాల ప్రజలకు సత్వర న్యాయం అందించే గొప్ప అవకాశం లభిస్తుందని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసే అవకాశం వస్తుందని అన్నారు. శిక్షణ కేంద్రంలో తమ ప్రతిభా పాటవాల ద్వారా, తమ యొక్క మంచి ప్రవర్తన మరియు క్రమశిక్షణ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ అడిషనల్ డీసీపీ శ్యాంసుందర్, ఏసిపిలు నరేందర్ గౌడ్, ఇమ్మునేల్, సిఏఓ పుష్పరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Related Posts

BREAKING: సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu)కు ఈడీ అధికారులు నోటీసులు(ED Notice) పంపారు. సురానా గ్రూప్(Surana Group), సాయి సూర్య డెవలపర్ల(Sai Surya Developers)కు సంబంధించిన వ్యవహారంలో ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈనెల 27న విచారణ(investigation)కు రావాలని…

మరో దారుణం.. భర్తను చంపి పూడ్చి పెట్టిన భార్య.. చివరకు?

భార్యల చేతిలో భర్తల చావులు ఈ మధ్య ఎక్కువయ్యాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. వేధింపులు తట్టుకోలేక కొందరు.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మరికొందరు.. ఇలా వివిధ కారణాలతో భర్తను భార్య హతమారుస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *