GHMC: ముగ్గులు వేస్తూ అవగాహన కల్పిస్తూ..బల్దియా సరి‘కొత్త’ప్రయత్నం..

మన ఈనాడు: మహనగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి..ఇంటింటికి చెత్త సేకరించే ఆటోలు, రిక్షాలు వెళ్తున్నా..రోడ్లుపై చెత్త కుప్పలు మాత్రం పెరుగుతున్నాయి. వీటిని తొలగించేందుక జీహెచ్​ఎంసీ(GHMC) సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.

ఉప్పల్​ సర్కిల్​ పరిధిలోని రామంతాపూర్​, హబ్సిగూడ, చిల్కానగర్​, ఉప్పల్​ డివిజన్ల పరిధిలోని నిత్యం చెత్త వేసే ప్రాంతాలను బల్దియా అధికారులు గుర్తించారు. వీటిని గ్రీన్​ కర్టెన్స్​గా మార్పు చేశారు. ఈప్రాంతాల్లో పారిశుద్ద్య సిబ్బంది అందమైన ముగ్గులు వేస్తూ చెత్త వేయకుండా నివారణ చర్యలు చేపడుతున్నారు.

పొదుపు సంఘాల రిసోర్స్​ పర్సన్​లతో సమన్వయ్యం చేసుకుంటూ చెత్తవేసే వారిని గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించేలా చైతన్యకార్యక్రమాల బాధ్యతలను తీసుకుంది ఉప్పల్​ సర్కిల్​. ప్రత్యేకంగా ఒక్కొ కార్మికుడిని సెక్యూరిటీగా ఉంచి చెత్త వేసేవారికి రూ.1000ల చలానా సైతం విధిస్తున్నారు.

జీహెచ్​ఎంసీ చెత్త కట్టడికి చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు అభినందిస్తున్నారు. అందమైన నగరంలో చెత్త కుప్పులు వేయకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూనే అవసరమైతే మరికొన్ని చెత్త రిక్షాలను కాలనీలకు పెంచేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Share post:

లేటెస్ట్