ఈ పోసొఫీ స్కీమ్​లో ఇన్వెస్ట్​ చేస్తే మీ డబ్బులు డబుల్​

మన ఈనాడు:Post Office Time Deposit Scheme Benefits : మీరు భవిష్యత్​ కోసం పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడి రావాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. పోస్టాఫీస్​ టైమ్​ డిపాజిట్ స్కీమ్​లో పెట్టుబడి పెడితే కచ్చితంగా మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. పైగా పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. పూర్తి వివరాలు మీ కోసం.

Post Office Time Deposit Scheme Benefits : ప్రజలు తమ భవిష్యత్ అవసరాల కోస డబ్బును పొదుపు చేసుకోవాలని అనుకుంటారు. ఇందుకోసం బెస్ట్ స్కీమ్స్ ఏమున్నాయా అని చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఇండియన్ పోస్ట్​ ఒక బెస్ట్ స్కీమ్​ను అందిస్తోంది. అదే పోస్టాఫీస్​ టైమ్ డిపాజిట్​ స్కీమ్​. ఏ మాత్రం నష్టభయంలేని, మంచి రాబడిని ఇచ్చే సురక్షితమైన పొదుపు పథకం ఇది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టాఫీస్​ టైమ్ డిపాజిట్ స్కీమ్ బెనిఫిట్స్​​మీరు ఈ పోస్టాఫీస్​ స్కీమ్​లో రూ.5 లక్షలు డిపాజిట్ చేశారనుకుందాం. దీనిపై మీకు 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. అందువల్ల 5 ఏళ్లలో మీకు రూ.2,24,974 వడ్డీ వస్తుంది. ఒకవేళ మీరు పదేళ్లపాటు ఇదే స్కీమ్​లో కొనసాగారనుకోండి. అప్పుడు మీకు ఏకంగా రూ.5,51,175ల వడ్డీ వస్తుంది. అంటే పదేళ్ల తరువాత మీరు డిపాజిట్ చేసిన సొమ్ము రెట్టింపు కంటే ఎక్కువ అవుతుంది. ఈ పోస్టాఫీస్​ స్కీమ్​లో చేరడానికి ఎలాంటి పరిమితులు లేవు. కేవలం రూ.100లతో పొదుపు ప్రారంభించినా సరిపోతుంది.

పథకం చేరడానికి కావాల్సిన అర్హతలు
ఈ పోస్టాఫీస్​ స్కీమ్​లో చేరాలంటే, కచ్చితంగా టైమ్ డిపాజిట్​/ ఫిక్స్​డ్​ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.రూ.1000 కనీస మొత్తంతో ఈ పథకంలో చేరవచ్చు. గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితులు లేవు.ఈ స్కీమ్​లో చేరాలంటే, ఖాతాదారుని వయస్సు తప్పనిసరిగా 10 ఏళ్లు నిండి ఉండాలి.మైనర్ల తరపున వారి తల్లిదండ్రులు ఈ పోస్టాఫీస్ అకౌంట్​ను ఓపెన్ చేయవచ్చు.మీరు ఈ స్కీమ్​లో 1, 2, 3, 5 ఏళ్లు టైమ్​ పీరియడ్స్​లో పొదుపు చేయవచ్చు.వ్యక్తిగతంగా ఈ స్కీమ్​లో చేరవచ్చు. లేదా ఇతరులతో కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరవవచ్చు.

టైమ్ డిపాజిట్ – వడ్డీ వివరాలు
మీరు ఒక సంవత్సర కాలానికి టైమ్ డిపాజిట్ (టీడీ) చేస్తే 6.8 శాతం వడ్డీ ఇస్తారు. అదే 2 సంవత్సరాల కాలానికి టీడీ చేస్తే 6.9 శాతం వడ్డీ, మూడేళ్ల కాలానికి 7 శాతం వడ్డీ అందిస్తారు. 5 ఏళ్లకు డిపాజిట్ చేస్తే 7.5శాతం వడ్డీ అందిస్తారు. కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ప్రతి త్రైమాసికంలోనూ ఈ వడ్డీ రేట్లను క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది.ఈ పోస్టాఫీస్ స్కీమ్లో వచ్చిన రాబడిపై, ఇన్కం ట్యాక్స్ సెక్షన్ 80-సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సాధారణంగా రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది.

Related Posts

Gastric Problems: గ్యాస్ట్రిక్​ వేధిస్తోందా? ఇలా తగ్గించుకోండి

సరైన సమయానికి ఆహారం తినకపోవడం, జీర్ణ వ్యవస్థలో తలెత్తిన సమస్యల కారణంగా పొట్టలో గ్యాస్ సమస్య (Gastric problem) వేధిస్తుంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య బాధపెడుతుంటుంది. ఛాతి, కడుపులో మంటగా ఉంటూ ఇబ్బంది పెడుతుంది. శరీరాన్ని శక్తి హీనంగా…

Cancer Medicine: క్యాన్సర్ మందులపై ధరలు తగ్గించిన కేంద్రం

క్యాన్సర్ (Cancer Medicine ) తగ్గించే మూడు మందుల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ లోక్ సభ వేదికగా ప్రకటించారు. క్యాన్సర్ రోగులకు ఈ తగ్గింపులతో కొంతమేరకైనా ప్రయోజనం కలుగుతుంది. ట్రాస్టూజుమాబ్ డెరక్స్టెకాన్, ఓసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్ అనే మందులపై రేట్లను తగ్గించాలని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *