మన ఈనాడు:పేటీఎం వాలెట్ ను కొనుగోలు చేయాలని ముఖేష్ అంబానీ ప్రయత్నిస్తున్నారంటూ కొన్ని రోజుల క్రితం కార్పొరేట్ సర్కిల్స్ లో వినిపించింది. ఇప్పుడు పేటీఎంపై ఆర్బీఐ చర్యల తరువాత ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. పేటీఎం జియో తోనూ, HDFC బ్యాంక్‌తోనూ చర్చలు జరుపుతోందని చెప్పుకుంటున్నారు.
Paytm and Jio News: పేటీఎం వాలెట్‌పై ముఖేష్ అంబానీ కన్నేశారా? కొన్ని రోజులుగా ఈ ప్రశ్న కార్పొరేట్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు Paytm వాలెట్‌పై నిషేధం వంటి చర్యలను RBI తీసుకున్న తరువాత ఈ వార్త మరింత ఊపందుకుంది. ఇప్పుడు ఈ వార్త స్ప్రెడ్ అయిన వెంటనే, ముఖేష్ అంబానీకి చెందిన ఎన్‌బిఎఫ్‌సి కంపెనీ జియో ఫైనాన్షియల్ (Jio Financial) షేర్లు రాకెట్‌గా మారాయి. ముఖేష్ అంబానీకి చెందిన ఈ కంపెనీ షేర్లు 14 శాతానికి పైగా దూసుకుపోయి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు, ఫిన్‌టెక్ కంపెనీ దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రుణదాత HDFC బ్యాంక్‌తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు కూడా ఉన్నాయి.
రిపోర్ట్స్ ప్రకారం, One 97 కమ్యూనికేషన్స్ తన వాలెట్ వ్యాపారాన్ని విక్రయించడానికి ముఖేష్ అంబానీ (Mukesh Ambani) Jio ఫైనాన్షియల్ – HDFC బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. ఈ విషయంపై అవగాహన ఉన్న ఫిన్‌టెక్, బ్యాంకింగ్ రంగాలలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను ఉటంకిస్తూ, Paytm వాలెట్ (Wallet) వ్యాపారాన్ని కొనుగోలు చేయడంలో HDFC బ్యాంక్, Jio ఫైనాన్షియల్ ముందున్నాయని హిందూ బిజినెస్ లైన్ పేర్కొంది. ఇది Paytm పేమెంట్స్ బ్యాంక్‌లో (Paytm Payment Bank) విలీనం అవుతుంది.
విజయ్ శేఖర్ శర్మ బృందం గత నవంబర్ నుండి జియో ఫైనాన్షియల్‌తో చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. నివేదిక ప్రకారం, RBI ద్వారా Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధానికి ముందు HDFC బ్యాంక్‌తో చర్చలు ప్రారంభమయ్యాయి. పెద్ద బెయిలౌట్ ప్లాన్‌లో భాగంగా, Jio Paytm పేమెంట్స్ బ్యాంక్‌ని కొనుగోలు చేయవచ్చని కూడా నివేదిక పేర్కొంది.
BSE డేటా ప్రకారం, Jio ఫైనాన్షియల్ షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి కంపెనీ షేర్లు 12 శాతం లాభంతో రూ.283.25 వద్ద ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ సెషన్‌లో, కంపెనీ షేర్లు 14 శాతానికి పైగా పెరుగుదలతో రికార్డు స్థాయికి చేరుకోగా, కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ.289.70కి చేరాయి. అయితే ఈరోజు కంపెనీ షేర్లు రూ.256 ఫ్లాట్ లెవెల్లో ప్రారంభమయ్యాయి. శుక్రవారం కంపెనీ షేర్లు రూ.253.75 వద్ద ముగిశాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.83 లక్షల కోట్లు దాటింది.