Hyd Crime News| జగద్గిరిగుట్ట పరిధిలో బాలికపై అత్యాచారం

Mana Enadu: జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు సిద్ధుపై పోక్సో కేసు నమోదు చేశారు.

గతంలో భర్త నుంచి విడిపోయిన బాధిత బాలిక తల్లి.. చంద్రశేఖర్‌ అలియాస్‌ సిద్ధుతో సహజీవనం చేస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు.

తండ్రి వద్ద పిల్లలు ఉంటుండగా.. దసరా పండుగకు తల్లి ఇంటికి బాలిక వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై సిద్ధు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దసరా నుంచి వేధింపులు సాగుతుండటంతో తాళలేక బాధితురాలు తల్లికి చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Share post:

Popular