టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM)గా బాధ్యతలు చేపట్టారు. రాజకీయా(Politics)ల్లో తీరికలేని సమయాన్ని గడుపుతున్నారు. దీంతో హీరోగా తాను గతంలో ఒప్పుకున్న సినిమాల(Movies)పై నిత్యం ఏదో ఒక చర్చ వినిపిస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల ముందు 3 సినిమాలకు సైన్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న పవన్ ఆ తర్వాత సినిమా పక్కన పెట్టేశారన్న వార్తలూ జోరందుకున్నాయి.
అభిమానుల్లో అనేక సందేహాలు
అయితే ఇందులో ‘హరిహర వీరమల్లు(Harihara Veeramallu)’ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక OG, ఉస్తాద్ భగత్‌సింగ్ సంగతి సరే సరి. అయితే పవన్ కళ్యాణ్ కొన్ని డేస్ ఇచ్చి ఆ డేట్స్‌లో మాత్రమే షూటింగ్‌కి వస్తానని ఆ మధ్య హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆయన ఏ సినిమా షూటింగ్లో పాల్గొనలేదు. దాంతో ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా? లేదా అన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.

అన్నీ అనుకూలిస్తే తమిళనాడులోనూ..
తాజాగా సినిమాల గురించి తమిళ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ అదేంటంటే.. రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ కొనసాగుతారా? అన్న ప్రశ్నకు పవన్ సమాధానమిచ్చారు. తనకు డబ్బులు అవసరం ఉన్నన్ని రోజులూ సినిమాల్లో నటిస్తానని, అయితే అందుకోసం పరిపాలనా, రాజకీయ పనులతో రాజీపడను అని తెలిపారు. ఇక తమిళనాడులోనూ జనసేనను బరిలోకి దింపుతారా? అనే మరో ప్రశ్నకూ పవన్ బదులిచ్చాడు. అన్నీ అనుకూలిస్తే తమిళనాడులోనూ జనసేనను విస్తరిస్తామని స్పష్టం చేశాడు. అయితే తాను ఏదీ ముందుగా ప్లాన్ చేసుకోనని, తమిళ ప్రజలు ఆ వాతావరణాన్ని సృష్టిస్తే జనసేన అక్కడ రంగంలోకి దిగుతుందన్నారు.
“Dabbulu avasaramainantha varaku cinemalu chestune untanu”, ante daana dharmalu jeevitantam chestune untadu kabatti,aa daana dharmalaki dabbulu undali kabatti, cinema lu kuda chestune undaali.
pic.twitter.com/9eBbSRNQVo— Satya (@YoursSatya) March 23, 2025






