
అమెరికా(USA).. కెనడా(Canada) మధ్య ట్రేడ్ వార్(Trade War) నడుస్తోంది. మరోవైపు కెనడా తమ దేశంలో విలీనం కావాలంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్(Trump) బెదిరింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ(Canadian Prime Minister Mark Carney) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫుల్ మెజార్టీ కోసం ముందస్తు ఎలక్షన్ల(Elections)కు పిలుపునిచ్చాడు. దీంతో కెనడాలో వచ్చే నెల 28న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారి లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా(LPC)… ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ కెనడా(CPC)తో తలపడనుంది.
బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకే..
కాగా కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో(Justin Trudeau) వైదొలిగిన తర్వాత.. ప్రధానమంత్రి బాధ్యతలను ఆర్థిక నిపుణుడైన మార్క్ కార్నీ (60) మార్చి 14న బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ట్రంప్(trump) విధానాన్ని ఎదుర్కొనేందుకు ముందుగా మార్క్ కార్నీ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ప్రస్తుతం కెనడాలో లిబరల్ పార్టీకి మెజార్టీ ఉన్నా.. బలమైన ప్రభుత్వం ఏర్పాటు దిశగా కార్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
51వ రాష్ట్రంగా మారుస్తా: ట్రంప్
మరోవైపు పొరుగున ఉన్న కెనడాను అమెరికా(USA)లో 51వ రాష్ట్రంగా మారుస్తానని ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ బెదిరింపులను దృష్టిలో పెట్టుకుని మార్క్ కార్నీ ఈ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇప్పటికే పార్లమెంట్‌ను రద్దు చేసిన కార్నీ.. ఏప్రిల్ 28న ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ జనరల్‌ను అభ్యర్థించారు. ట్రంప్ ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమన్నారు.