
అక్రమ వలసల(Illegal Immigration)పై ట్రంప్ సర్కార్ తన ప్రతాపం చూపిస్తోంది. US అధ్యక్షుడిగా ట్రంప్(Donald Trump) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే భారత్ సహా ఆయా దేశాలకు సంబంధించిన అక్రమ వలసదారుల్ని పట్టుకుని స్వదేశాలకు పంపిస్తున్నారు. తాజాగా 5 లక్షల మంది వలసదారుల తాత్కాలిక నివాస హోదాను USA రద్దు చేసింది. కాగా ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కపాదం మోపుతున్నారు.
4 దేశాల నుంచి దాదాపు 5,32,000 మంది
తాజాగా క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులాకు సంబంధించిన 5లక్షల మందికి పైగా వలసదారులకు పెరోల్ కార్యక్రమాలను ట్రంప్ ప్రభుత్వం(Trump Govt) రద్దు చేసింది. ఒక నెలలో వారిని బహిష్కరించే అవకాశం ఉందని హోంల్యాండ్ సెక్యూరిటీ వింగ్(Homeland Security Wing) తెలిపింది. ఈ ఆర్డర్ అక్టోబర్ 2022 నుంచి అమలవుతుందని పేర్కొంది. ఈ 4 దేశాల నుంచి దాదాపు 5,32,000 మంది వచ్చినట్లుగా గుర్తించింది. వీళ్లంతా అమెరికా నుంచి బహిష్కరణ(Deportation from America)కు గురికానున్నారు.
వారంతా చట్టపరమైన హోదా కోల్పోతారు
వారంతా తొలుత ఆర్థిక స్పాన్సర్ల(Financial sponsors)తో పాటు రెండేళ్లు నివాసించడానికి.. పని చేయడానికి అనుమతి పొందారని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ పేర్కొన్నారు. వీరు దాదాపు 30 రోజుల్లో చట్టపరమైన హోదా కోల్పోతారని తెలిపింది. మానవతా పెరోల్(Parole) కింద అమెరికాకు వచ్చే వారు రెండేళ్ల పాటు చట్టబద్ధంగా దేశంలో ఉపాధి పొందొచ్చు. ఆ తర్వాత శరణార్థి వీసా తీసుకోవచ్చు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రక్రియను నిలిపివేశారు.