ICC Test Rankings: తొలి రెండు స్థానాల్లో బుమ్రా, అశ్విన్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల

ManaEnadu: టీమ్ఇండియా(Team India) పేస్ గన్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌(ICC Test Rankings)లో దూసుకొచ్చాడు. తాజాగా ICC ప్రకటించిన ర్యాంకింగ్‌లో బుమ్రా 870 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరిగిన రెండు టెస్టు మ్యాచుల్లో 11 వికెట్లు తీసి సత్తాచాటాడు. మరో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) 869 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇలా ఇద్దరు భార‌త బౌల‌ర్లు మొద‌టి రెండు స్థానాల్లో నిల‌వ‌డం విశేషం.

 టాప్-5లో ఉన్నది వీరే

ఇదిలా ఉండగా బంగ్లాతో టెస్టు సిరీస్‌లో బుమ్రా, అశ్విన్ చెరో 11 వికెట్లు ప‌డ‌గొట్టారు. కానీ, మంచి ఎకాన‌మీ(Economy)తో బౌలింగ్ చేయ‌డం భారత పేసర్‌కి క‌లిసొచ్చింది. ఈ ఇద్దరి త‌ర్వాత టాప్‌-5లో ఆస్ట్రేలియా పేస్ బౌలర్లు హేజిల్‌వుడ్‌, పాట్ క‌మిన్స్‌, దక్షిణాప్రికా స్పీడ్ స్టార్ క‌గిసో ర‌బాడ ఉన్నారు. అలాగే టీమ్ఇండియా మ‌రో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా(Ravindra Jadeja) ఆరో స్థానంలో నిలిచాడు. ఇక ఈ ఏడాది ఫిబ్రవ‌రిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జ‌రిగిన టెస్టు సిరీస్‌(Test Series)లో స‌మ‌యంలోనూ జ‌స్ప్రీత్ బుమ్రా నం.1 ర్యాంక్ సాధించాడు. అప్పుడు కూడా మూడు స్థానాలు ఎగ‌బాకి అశ్విన్‌ను వెన‌క్కి నెట్టి నంబ‌ర్‌వ‌న్‌గా నిలిచాడు. మ‌రోవైపు ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్ కూడా బుమ్రానే. 2024లో ఇప్పటివ‌ర‌కు 7 టెస్టులు ఆడిన పేస‌ర్ ఏకంగా 38 వికెట్లు ప‌డగొట్టాడు.

 బ్యాటింగ్‌లో టాప్-3లోకి యశస్వీ

అటు శ్రీలంక(Srilanka) స్పిన్నర్ ప్రభాత్ జ‌య‌సూర్య కూడా ఏడు టెస్టులే ఆడి 38 వికెట్లే తీశాడు. కానీ, బౌలింగ్ స‌గ‌టులో మాత్రం బుమ్రానే మెరుగ్గా ఉన్నాడు. ఇక టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌(Batting Rankings)లో జో రూట్, కేన్ విలియ‌మ్సన్, య‌శ‌స్వీ జైస్వాల్ మొద‌టి మూడు స్థానాల్లో నిలిచారు. భార‌త యువ సంచ‌ల‌నం జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుప‌ర‌చుకొని మూడో ర్యాంక్ ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. అలాగే కింగ్ కోహ్లీ(Kohli) ఆరు స్థానాలు ఎగ‌బాకి ఆరో ర్యాంకులో నిలిస్తే.. రిష‌భ్ పంత్(Rishabh Pant) మూడు స్థానాలు దిగ‌జారి 9వ స్థానానికి చేరాడు. అటు భారత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohith Sharma) ఐదు స్థానాలు దిగ‌జారి 15వ స్థానానికి ప‌రిమిత‌మ‌య్యాడు. ఇక ఐసీసీ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో 124 పాయింట్లతో ఆస్ట్రేలియా(AUS) టాప్ ప్లేస్‌లో ఉండగా, 120 పాయింట్లతో ఇండియా(IND) సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది. 108 పాయింట్లతో ఇంగ్లండ్(ENG), 104 పాయింట్లతో సౌతాఫ్రికా(SA), 96 పాయింట్లతో న్యూజిలాండ్(NZ) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

 

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *