ED Summons: మాజీ క్రికెటర్‌కి ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

ManaEnadu: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌(Former Indian Cricketer Azharuddin)కు ఈడీ అధికారులు షాకిచ్చారు. ఆయన హయాంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌(HCA)లో అక్రమాలు జరిగాయంటూ ఈడీ అధికారులు(ED officials) ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు హెచ్సీఏలో జరిగిన అవకతవకలపై ED దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఉప్పల్‌ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ మూడు F.I.Rలు నమోదయ్యాయి. ఇందులో భాగంగా అజారుద్దీన్‌కు నోటీసులు జారీ అయ్యాయి. HCA అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అవినీతి(Corruption) జరిగినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో అగ్నిమాపక వ్యవస్థలు, జనరేటర్లు, ఇతర సామగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ. 20 కోట్ల మేర అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఆచయనకు ED అధికారులు నోటీసులు పంపారు.

 నిబంధనలు ఉల్లంఘించినందుకు అనర్హత వేటు

కాగా గతేడాది ఫిబ్రవరిలో అజారుద్దీన్‌ను HCA అధ్యక్ష పదవి నుంచి సుప్రీంకోర్టు(Supreme Court) తప్పించిన విషయం తెలిసిందే. అంతేగాక హెచ్‌సీఏ పనితీరును పరిశీలించేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు రిటైర్డ్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. కాగా, గత హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నిక(HCA presidential election)ల్లో పోటీ చేయకుండా అజహరుద్దీన్ పై కమిటీ అనర్హత వేటు వేసింది. ఏకకాలంలో హెచ్‌సీఏ, డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా వ్యవహరించి నిబంధనలు ఉల్లంఘించినందుకు అనర్హత వేటు వేస్తున్నట్లు తెలిపింది.

 99 టెస్టులు,334 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం

కాగా, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అజారుద్దీన్ 2009లో UPలోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై MPగా ఎన్నికయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. 2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక క్రికెట్ కెరీర్ విషయానికొస్తే అజహారుద్దీన్ టీమ్ఇండియా(TeamIndia) సారథిగా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. 99 టెస్టులు, 334 ODIలు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 6,215 పరుగులు, వన్డేల్లో 9,378 పరుగులు సాధించాడీ హైదరాబాదీ ప్లేయర్.

 

Share post: