ManaEnadu: అభిమానులను ఉర్రూతలూగించేందుకు మరో పొట్టి క్రికెట్ సమరం నేడు ప్రారంభం కానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా ఉమెన్స్ టీ20 ప్రపంచకప్(WT20WC-2024) జరగనుంది. ఈ టోర్నీ అక్టోబర్ 20 వరకు కొనసాగనుంది. తొలి మ్యాచులో బంగ్లాదేశ్(BAN), స్కాంట్లాండ్(SCO) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు షార్జా వేదికగా జరగనుంది. రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఇదే వేదికపై శ్రీలంక, పాకిస్థాన్ జట్లు పోటీపడనున్నాయి. కాగా టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా టీమ్ఇండియా(Team India) జర్నీ రేపు ప్రారంభంకానుంది. న్యూజిలాండ్‌తో హర్మన్ ప్రీత్ కౌర్(Harman Preet Kaur) సేన తన తొలి మ్యాచ్ ఆడనుంది. రేపు దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
10 జట్లు రెండు గ్రూపులుగా
కాగా ఈ టోర్నీలో మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-Aలో భారత్, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. గ్రూప్-Bలో వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాంట్లాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఉన్నాయి. ఈ వరల్డ్ కప్‌లో భాగంగా 23 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ప్రతి గ్రూప్‌లో మొదటి 2 స్థానాల్లో నిలిచిన టీమ్స్ సెమీస్ (Semi Final)కు చేరుకుంటాయి. సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు అక్టోబర్ 20న ఫైనల్లో తలపడతాయి. కాగా టీ20 వరల్డ్ కప్ ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉంది. కానీ అక్కడ రాజకీయ అల్లర్ల(Political riots) కారణంగా యూఏఈలో నిర్వహిస్తున్నారు.
భారత్ షెడ్యూల్ ఇదే..
భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(Pakistan)ను అక్టోబర్ 6న దుబాయ్‌లో ఢీకొంటుంది. అక్టోబర్ 17, 18 తేదీల్లో సెమీఫైనల్స్ జరుగుతాయి. మొత్తం మ్యాచులను దుబాయ్, షార్జా(Dubai, Sharjah) వేదికగా నిర్వహించనున్నారు. కాగా 2020లో భారత్ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆసీస్ ఈ టోర్నీలో ఏకంగా ఎనిమిసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.