ManaEnadu: మహిళా క్రికెటర్లకు(Women Cricketers) ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) గుడ్ న్యూస్ చెప్పింది. పురుషుల టీమ్‌తో సమానంగా T20 వరల్డ్ కప్‌కు ప్రైజ్ మనీ(Prize money) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విజేతగా నిలిచిన జట్టుకు 2.34 మిలియన్ డాలర్లు ప్రకటించింది. ఇది గతేడాది ప్రైజ్‌మనీ (1మి.డాలర్లు) కంటే 134% ఎక్కువ. రన్నరప్‌గా నిలిచిన టీమ్‌కు 1.17 మి.డాలర్లు(గతంలో 5,00,000 డాలర్లు), సెమీ ఫైనల్స్(Semi finals)లో ఓడిన రెండు జట్లకు 6,75,000 డాలర్ల చొప్పున ఇవ్వనుంది. కాగా OCT 3 నుంచి UAEలో మహిళల T20 WC జరగనుంది. ఈ నిర్ణయంతో మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ పెరుగుతుందని ఐసీసీ పేర్కొంది.
యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి ప్రారంభం
గ్రూపు దశలోనే నిష్ర్కమించినా కూడా ICC ప్రైజ్‌మనీ దక్కనుంది. ఒక్కొ జట్టుకు 1,12,500 డాలర్లు చొప్పున అందించనున్నారు. ఇక గ్రూపు దశలో మ్యాచ్ గెలిస్తే.. 31154 డాలర్లు ఇస్తారు. 5 నుంచి 8వ స్థానాల్లో నిలిచే జట్లకు 2.7 లక్షల డాలర్లు, 9, 10వ స్థానాల్లో ఉన్న వారికి 1.35 లక్షల డాలర్లు అందజేయనున్నారు. మహిళల క్రికెట్‌కు ఆదరణ పెంచే ఉద్దేశ్యంతో ఐసీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.UAE వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకు మహిళల T20 ప్రపంచకప్ 2024 జరగనుంది. అక్టోబర్ 17, 18 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. అక్టోబర్ 20న ఫైనల్ జరగనుంది
మహిళల T20 ప్రపంచకప్ Group-A:
– ఆస్ట్రేలియా
– భారత్
– న్యూజిలాండ్
– పాకిస్థాన్
– శ్రీలంక
* మహిళల T20 ప్రపంచకప్ Group-B
– దక్షిణాఫ్రికా
– ఇంగ్లండ్
– వెస్టిండీస్
– బంగ్లాదేశ్
– స్కాట్లాండ్