ManaEnadu: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ(Asia Champions Trophy Hockey Tournament)లో భారత్ దుమ్మురేపుతోంది. అద్భుతమైన ఆటతీరుతో మెన్ ఇన్ బ్లూ(Men In Blue) ఘన విజయాలు సాధిస్తూ ఫైనల్‍కు దూసుకెళ్లింది. చైనాలోని మోకీ వేదికగా సోమవారం (సెప్టెంబర్ 16) జరిగిన సెమీఫైనల్‍లో దక్షిణ కొరియా(South Korea)పై టీమ్ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సెమీస్‍లో హర్మన్ ప్రీత్ సేన 4-1 తేడాతో కొరియాపై ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత్.. మ్యాచ్ పూర్తయ్యే వరకూ ఆధిపత్యం ప్రదర్శించి గెలిచింది. కాగా.. ఈ టోర్నీలో భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవడం ఇది ఆరోసారి కావడం విశేషం. ఇప్పటి వరకు టీమ్ఇండియా(Team India) నాలుగు సార్లు విజేతగా నిలిచింది. ఈ సారి కూడా గెలిచి ఐదోసారి ఛాంపియన్‌గా నిలవాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది.
ప్రారంభం నుంచి భారత్‌దే పైచేయి
కాగా మ్యాచ్ ప్రారంభమైన 13వ నిమిషంలోనే ఉత్తమ్ సింగ్ గోల్(Goal) బాదాడు. దీంతో భారత్ అకౌంట్ తెరిచింది. ఆ తర్వాత 19వ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్(Harman Preet) మరో గోల్ సాధించాడు. దీంతో హాఫ్ టైమ్ ముగిసే సరికి ఇండియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జర్మన్‍ప్రీత్ సింగ్ 32వ నిమిషంలో మరో గోల్ కొట్టాడు. అయితే, ఆ తర్వాతి నిమిషంలోనే కొరియా ప్లేయర్ జిహూన్ యాంగ్ గోల్ చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. గోల్ పోస్ట్ పై రెండు జట్లూ అటాకింగ్‌కు దిగాయి. ఈ సమయంలో భారత ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్ 45వ నిమిషంలో మరో గోల్ చేశాడు. దీంతో స్కోరు 4-1కు చేరింది. చివరి వరకు ఆధిపత్యాన్ని నిలుపుకొని విజయం భారత్ మరుపురాని విజయాన్ని సొంతం చేసుకుంది.
వరుసగా ఐదు మ్యాచుల్లో జయభేరి
గ్రూపు దశలో వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచింది భారత్. చైనాను 3-0 గోల్స్ తేడాతో మట్టికరిపించింది. ఇక రెండో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌ను 5-1తో చిత్తు చేసింది. ఆ తర్వాత మలేషియాను 8-1తో, పాకిస్థాన్‌ను 2-1తో ఓడించింది. అదే ఊపులో సెమీఫైనల్‌లోనూ విజయం సాధించి అజేయంగా ఫైనల్(Final)కు చేరుకుంది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‍లో చైనా(Chaina)తో టీమ్ఇండియా తలపడనుంది. ఈ టైటిల్ పోరు మంగళవారం (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.