ManaEnadu: రాహుల్ ద్రవిడ్(Rahul Dravid).. క్రికెట్‌లో ఆల్‌టైమ్ దిగ్గజాల(All Time Greatest Players)లో ఒకరు. తన సొగసైన ఆటతో, బలమైన టెక్నిక్‌తో టీమ్‌లో స్పెషలిస్ట్(Specialist)గా ప్లేయర్‌గా మారాడు. ఒకపక్క సచిన్, గంగూలీ, అజారుద్దీన్, సెహ్వాగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు తమ అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థులను చిత్తు చేస్తుంటే.. మరో పక్కా తన సాలిడ్ డిఫెన్స్(Defence)తో జట్టుకు అడ్డుగోడలా నిలబడేవాడు. టీమ్ ఇండియా(Team India)కు ఎంపికైన తొలిరోజుల్లో తొలుత బ్యాటర్‌గానే కొనసాగిన ద్రవిడ్.. ఆ తర్వాత వికెట్ కీపర్ గ్లౌవ్స్ అందుకున్నాడు. 1999లో నయాన్ మోంగియా గాయపడటంతో ద్రవిడ్‌కి ఈ అవకాశం దక్కింది. ఆ తర్వాత 2003 వన్డే వరల్డ్ కప్‌లో కెప్టెన్ గంగూలీ మళ్లీ ద్రవిడ్‌కు వికెట్ కీపింగ్(Wicket keeping) బాధ్యతలు అప్పగించాడు.
ఇంగ్లండ్‌లో చివరి వన్డే
ఇంతకీ ఇప్పుడెందుకు ద్రవిడ్ మ్యాటర్ అనుకుంటున్నారా.. అవునండీ ఈ మాజీ కెప్టెన్ తన చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడి నేటికి 13ఏళ్లు పూర్తయింది. సెప్టెంబర్ 16, 2011న రాహుల్ ద్రవిడ్ టీమ్ఇండియా తరఫున తన చివరి వన్డే మ్యాచ్(Last ODI) ఆడాడు. ఇంగ్లండ్‌తో కార్డిఫ్‌లో జరిగిన మ్యాచ్ అనంతరం ద్రవిడ్ తన ODI కెరీర్‌కి గుడ్ బై చెప్పాడు. తన చివరి మ్యాచ్‌లోనూ ఈ వెటరన్ బ్యాట్స్‌మెన్ 69 పరుగులతో రాణించాడు. బ్యాటింగ్ పట్ల ఎంతో సహనం, టెక్నిక్, స్టైల్ ఆయన సొంతం. అందుకే ఆయనను క్రీడాభిమానులు ‘ది వాల్(The Wall)’ అని పిలుస్తుంటారు. అంతే కాదు గంగూలీ తర్వాత టీమ్ఇండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకొని అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు ద్రవిడ్.
భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందించి..
ముఖ్యంగా ద్రవిడ్ టెస్టు(Tests)ల్లో ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షించేవాడు. ఎలాంటి బంతులు వేసినా తగ్గేదేలేదన్నట్లు ఎంతో కూల్(Cool)గా ఎదుర్కొనేవాడు. అయితే తన 15 ఏళ్ల ODI కెరీర్‌లో ద్రవిడ్ 344 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 12 సెంచరీలు, 83 అర్ధసెంచరీలతో సహా 39.16 సగటుతో 10,889 పరుగులు చేశాడు. అంతేకాదు ఈ దిగ్గజ ఆటగాడు 73 వన్డేల్లో కీపర్‌గా సేవలు అందించాడు. 71 క్యాచ్‌లు పట్టడమే కాకుండా 13 మంది స్టంపౌట్ చేశాడు. ద్రవిడ్ చివరిసారిగా ODI జెర్సీలో మైదానం నుంచి బయటికి వెళ్తున్నప్పుడు, అభిమానులు, సహచరులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇదిలా ఉండగా రెండేళ్ల క్రితం ఆయనకు BCCI టీమ్ఇండియా కోచ్ పదవిని అప్పగించగా.. ఇటీవల T20 వరల్డ్ కప్ అందించి కోచ్‌గానూ వైదొలిగాడు ‘‘ది వాల్’’.