KL Rahul : RCBలోకి కేఎల్ రాహుల్.. హింట్ ఇచ్చిన స్టార్ బ్యాటర్

Mana Enadu : టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఐపీఎల్​లో ప్రస్తుతం లఖ్​నవూ సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) టీమ్​కు కెప్టెన్​గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ క్రికెటర్ ఈ జట్టును వీడతాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలు కాస్త రాహుల్ వరకు చేరాయి. దీంతో రాహుల్ 2025 ఐపీఎల్​లో ఆర్సీబీ (RCB Team) జట్టుకు ఆడతాడా? అన్న విషయంపై తాజాగా హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

KL Rahul RCB 2025

ఆర్సీబీ ఫ్యాన్ కేఎల్​ రాహుల్​తో మాట్లాడిన ఓ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో సదరు అభిమాని రాహుల్ ఆర్సీబీకి ఆడితే చూడాలని ఉందని తన మనసులోని మాటను చెప్పాడు. ‘నేను ఆర్సీబీ జట్టుకు డై హార్డ్ ఫ్యాన్​ని. చాలా కాలంగా ఆర్సీబీని ఫాలో అవుతున్నాను. మీరు కూడా గతంలో ఆర్సీబీ(Royal Challengers Bengaluru)కి ఆడారు. ప్రస్తుతం వైరల్​ అవుతున్న రూమర్స్​ గురించి నేను మాట్లాడను. కానీ, మీరు ఆర్సీబీకి మళ్లీ ఆడితే చూడాలనుకుంటున్నాను’ అని రాహుల్​తో అన్నాడు. దానికి రాహుల్ ‘లెట్స్ హోప్’ అని బదులిచ్చాడు.

ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్ (RCB Fans) ఈ వీడియోను ట్రెండ్ చేస్తూ ‘రాహుల్​కు ఆర్సీబీ ఫ్రాంచైజీపై మంచి అభిప్రాయం ఉంది’, ‘రాహుల్ ప్లీజ్ ఆర్సీబీకి వచ్చెయ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 2013లో రాహుల్ ఆర్సీబీ జట్టుతోనే ఐపీఎల్​లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

2014, 2015 సీజన్లలో సన్​రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad)​కు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ 2016లో ఆర్సీబీకి తిరిగి వచ్చాడు. గాయం కారణంగా 2017 ఐపీఎల్​లో ఆడలేదు. 2018 ఆర్సీబీ అతడిని వదులుకోవడంతో రాహుల్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టుకు వెళ్లాడు. 2021 దాకా పంజాబ్​తో ఉన్న రాహుల్ ఆ తర్వాత లఖ్​నవూ ఫ్రాంచైజీకి కెప్టెన్ అయ్యాడు.

ఈ ఏడాది 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్​తో మ్యాచ్ ఓడిన తర్వాత లఖ్​నవూ ఓనర్ సంజీవ్ గోయెంకా (Sanjeev Goenka) కెప్టెన్ రాహుల్​పై అందరిముందే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అప్పటి నుంచి రాహుల్ జట్టు మారడతాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వైరల్ అవుతున్న వీడియోతో రాహుల్ టీమ్ మారడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Share post:

లేటెస్ట్