Mana Enadu: రోహిత్ శర్మ(Rohit Sharma).. తన అద్భుతమైన కెప్టెన్సీ(Captaincy)తో టీమ్ఇండియా(Team India)కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఇటీవల అతడి కెప్టెన్సీలోనే భారత్ T20 వరల్డ్ కప్ సైతం నెగ్గింది. అంతకుముందు జరిగిన ODI ప్రపంచకపక్‌లో భారత్ ఫైనల్(Final) వరకూ వెళ్లడంలోనూ కీలకంగా వ్యహరించాడు. ఆ టోర్నీలో అతడి వ్యక్తిగత ఆటతోపాటు జట్టునూ ముందుండి నడిపించాడు రోహిత్. మైదానంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో హిట్ మ్యాన్(Hitman) దిట్ట. సీనియర్లు, జూనియర్లను హిట్ మ్యాన్ హ్యాండిల్ చేసిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. దాంతోపాటు ఎంత ఒత్తిడిలో ఉన్నా తన ముఖంలో మాత్రం అలాంటిదేమీ లేదన్నట్లు తీసుకున్న నిర్ణయాలు టీమ్ఇండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాయి. T20 ప్రపంచకప్ తర్వాత హిట్ మ్యాన్ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీపై కూడా తాజాగా వార్తలు వస్తున్నాయి. అతడు ఇకపై ఎక్కువ కాలం వన్డేల్లో టీమ్‌కు సేవలు అందించలేకపోవచ్చు. ఎందుకంటే హిట్ మ్యాన్‌కు ఇప్పటికే 37ఏళ్లు. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకూ అతడు జట్టులో కొనసాగే అవకాశాలు తక్కువ. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ కెప్టెన్సీలో కొనసాగడంపై పలు అనుమానాలు నెలకొన్నాయి.
మినీ ప్రపంచకప్ తర్వాతే నిర్ణయం
ఇదిలా ఉండగా ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy 2025) టోర్నమెంట్ పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి, మార్చి 2025లో జరగనుంది. 50 ఓవర్ల ప్రపంచకప్ తర్వాత, ICC నిర్వహించే అతిపెద్ద టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ అని క్రీడాలోకం భావిస్తుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే దీనిని మినీ ప్రపంచకప్ అని కూడా పిలుస్తుంటారు. ఒకవేళ టీమ్ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌ను గెలిస్తే, రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కూ వీడ్కోలు పలికే అవకాశం కొంత వరకు ఉంది. ఇక హిట్ మ్యాన్ శకం ముగియడంతో టీమ్ ఇండియాలో నవ శకం పురుడు పోసుకోనుంది. వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా వ్యవహరించేందుకు పలువురు ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. వారిపై ఓ లుక్ వేద్దామా..
బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్
హార్దిక్ పాండ్య.. రోహిత్ శర్మ స్థానంలో వన్డే కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya)కు అవకాశం ఉంది. హార్దిక్ కెప్టెన్సీలో కపిల్ దేవ్(Kapil Dev) శైలిని చూడవచ్చని పలువురు మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగానే ఐపీఎల్(IPL)లో తాను కెప్టెన్సీ చేసిన తొలి సీజన్‌లోనే హార్దిక్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు IPL 2022 టైటిల్‌ను అందించాడు. పాండ్య బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎంతోకూల్ గా ఉంటాడు. అటు బౌలింగ్‌లోనూ గంటకు 140 కిమీ వేగంతో బంతులు సంధించగలడు కూడా. అందుకే వన్డే కెప్టెన్సీ చేపట్టేందుకు హార్దిక్ పాండ్యకు అన్ని అర్హతలు ఉన్నాయని పలువురు అంటున్నారు.
అయ్యర్‌కు అందలం దక్కేనా?
శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer).. భారత వన్డే కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ పెద్ద పోటీదారుడిగా చెప్పవచ్చు. అతడి కెప్టెన్సీలో ఇటీవల IPL 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ నెగ్గింది. అతడు కెప్టెన్సీ చేపడితే భారత జట్టు అదృష్టాన్ని కూడా మార్చేయగలడని మాజీలు అభిప్రాయపడుతున్నారు. టీమ్ ఇండియా(Team India)కు అయ్యర్ లాంటి నిర్భయ బ్యాట్స్‌మెన్, తెలివైన కెప్టెన్ అవసరం. అతని బ్యాటింగ్ లాగే, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కూడా దూకుడుగా ఉండగలడు. పైగా కోచ్ గౌతమ్ గంభీర్(Coach Gautam Gambhir) మద్దతు కూడా అయ్యర్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది.
మరో ధోనీగా రిషభ్
రిషభ్ పంత్(Rishabh Pant).. అద్భుత కీపింగ్ స్కీల్స్‌తోపాటు అటాకింగ్ గేమ్ ఆడటంతో పంత్ దిట్ట. ముఖ్యంగా టీ20లు, టెస్టుల్లో పంత్ ఎంతో డేంజరస్ బ్యాటర్(Dangerous batter). రిషబ్ పంత్ స్మార్ట్ మైండ్ కలిగి ఉన్నాడు. పంత్‌కు కెప్టెన్‌గా ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు కెప్టెన్‌గా రిషభ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కొత్త విషయాలు నేర్చుకోవడంలోనూ ఈ లెఫ్ట్ హ్యాండర్ చాలా నేర్పరి. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni)కి ఉన్న బలం రిషభ్ పంత్‌కు కూడా ఉంది. ఒక వికెట్ కీపర్ మైదానంలో ఏ ఆటగాడి ఆటనైనా బాగా అర్థం చేసుకోగలడు. ఇటువంటి పరిస్థితిలో పంత్ కూడా MS ధోని వంటి కెప్టెన్సీలాగా విజయం సాధించగలడని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. వీరితోపాటు ప్రస్తుతం టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), యంగ్ అండ్ డైనమిక్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) సైతం టీమ్ ఇండియా వన్డే జట్టు పగ్గాలు అందుకునేందుకు పోటీలో ఉన్నారు. అయితే BCCI మాత్రం ఎవరికి ఆ అవకాశం ఇస్తుందో తేలాలంటే త్వరలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ వరకూ ఆగాల్సిందే.