Mana Enadu: ఫుల్ ఫామ్‌లో ఉన్న టీమ్ఇండియా(Team India) మరో మ్యాచ్‌కు రెడీ అయింది. పొట్టి ఫార్మాట్‌లో మరో సిరీస్‌ను పట్టేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్(Bangladesh)తో నేడు రెండో T20లో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గి ఊపుమీదున్న సూర్య(SKY) సేన అదే కాన్ఫిడెన్స్‌తో సెకండ్ మ్యాచ్‌కూ సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో మరికొందరు కుర్రాళ్లను పరీక్షించాలని యంగ్ ఇండియా చూస్తోంది. మయాంక్(Mayank Yadhav) స్థానంలో హర్షిత్ రాణా, నితీశ్ స్థానంలో తిలక్ వర్మ(Tilak Varma) జట్టులోకి రావొచ్చు. మరోవైపు టెస్ట్ సిరీస్‌లోనూ చతికిలపడిన బంగ్లా ప్లేయర్లు టీ20 క్రికెట్లోనూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium, Delhi) వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
కోహ్లీ రికార్డుపై సూర్య కన్ను
సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. రిషభ్(Pant), అక్షర్, బుమ్రా(Bumrah), గిల్, జైస్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా అభిషేక్, మయాంక్, నితీశ్ లాంటి యువ క్రికెటర్లతోనే సత్తా చాటింది.ఈమ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులు చేస్తే కోహ్లీ(Kohli) రికార్డును సమం చేయవచ్చు. అత్యంత తక్కువ T20 మ్యాచుల్లో 2500 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలిచారు. విరాట్ 73 మ్యాచుల్లో 2500 పరుగుల మార్క్‌ను దాటారు. SKY 72 మ్యాచుల్లో 2461 రన్స్ చేశారు. పాక్ బ్యాటర్ బాబర్ 67 మ్యాచుల్లోనే 2500రన్స్ చేసి ప్రథమ స్థానంలో ఉన్నారు.
వెటరన్ ప్లేయర్‌కు వేర్‌వెల్ దక్కేనా
సాధారణంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఇక్కడి బ్యాటింగ్(Batting) పిచ్‌పై సూపర్ ఫామ్‌లో ఉన్న భారత బ్యాటర్లను నిలువరించాలంటే బంగ్లా బౌలర్లు చెమటోడ్చాల్సిందే. మరోవైపు బంగ్లా వెటరన్ ప్లేయర్ మహ్మదుల్లా(Mahmudullah)కు పొట్టి ఫార్మాట్‌లో ఇదే చివరి సిరీస్. దీంతో అతడికి ఘనంగా ఫేర్‌వెల్(Farewell) ఇవ్వాలని బంగ్లా భావిస్తోంది. ఆ జట్టు బ్యాటింగ్‌లో మిరాజ్, షంటో మాత్రమే రాణిస్తుండగా, బౌలర్లంతా తొలి టీ20లో ధారాళంగా పరుగులలు సమర్పించుకున్నారు.
తుది జట్లు (అంచనా)
IND: అభిషేక్, శాంసన్, సూర్యకుమార్ (కెప్టెన్), నితీశ్/తిలక్, హార్దిక్, రియాన్, రింకూ సింగ్, వాషింగ్టన్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్, మయాంక్ యాదవ్/ నితీశ్ రాణా.
BAN: లిట్టన్ దాస్, పర్వేజ్ హొస్సేన్, షంటో (కెప్టెన్), తౌహీద్, మహ్మదుల్లా, జకీర్ అలీ, మిరాజ్, రిషాద్, తన్జీమ్ హసన్, టస్కిన్, ముస్తాఫిజుర్, షోరిఫుల్.