Mana Enadu: టెస్టు, T20 ఫార్మాట్‌లలో బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా(Team India).. స్వదేశంలో మరో సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి న్యూజిలాండ్(New Zealand)తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. బెంగళూరు వేదికగా ఉదయం 9.30 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్(World Test Championship) ఫైనల్‌కు అర్హత సాధించడానికి అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే ఈ సిరీస్ టీమిండియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం. ప్రస్తుతం WTCలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా(Australia) రెండో స్థానంలో ఉంది. కాగా స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ అయిన చెపాక్‌లో తుది జట్టు ఎంపిక కూడా కెప్టెన్ రోహిత్(Captain Rohit)కు సవాల్‌గా మారింది. అశ్విన్, జడేజాతో పాటు మూడో స్పిన్నర్‌గా కుల్దీప్‌ను తీసుకుంటారా? అనేది సస్పెన్స్‌గా ఉంది. ఒకవేళ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో వెళ్లినా తుది జట్టులో అక్షర్ పటేల్‌నూ ఆడించే అవకాశముంది.
భారత్‌దే పైచేయి
మరోవైపు శ్రీలంక(Srilanka) పర్యటనలో ఘోర పరాజయం చవిచూసిన న్యూజిలాండ్ ఈ సిరీస్‌ను అయినా దక్కించుకోవాలని పట్టుదలతో సన్నద్ధమవుతోంది. గాయం కారణంగా కీలక బ్యాటర్ కేన్ విలియమ్సన్(Kane Williamson) దూరమవ్వడం కివీస్‌కు ప్రతికూలంగా మారింది. కాగా, భారత గడ్డపై ఇప్పటివరకు న్యూజిలాండ్ ఒక్కసారి కూడా ODI, టెస్టు సిరీస్ గెలవలేదు. మొత్తంగా ఇప్పటివరకు ఇరు జట్లు 62 టెస్టుల్లో తలపడగా భారత్ 22 మ్యాచుల్లో గెలవగా.. న్యూజిలాండ్ 13 మ్యాచుల్లో నెగ్గింది. మరో 27 టెస్టులు డ్రాగా ముగిశాయి.
వరుణుడు కరుణించేనా?
బెంగళూరులోని ఎంఏ చిన్నస్వామి స్టేడియం(MA Chinnaswamy Stadium)లో ప్రారంభం కావాల్సిన తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకులు సృష్టించేలా ఉన్నాడు. మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం(Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ(IMD) పేర్కొంది. నిన్నటి నుంచి అక్కడ వర్షం కురుస్తూనే ఉండడంతో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దయింది. మ్యాచ్ జరిగే మొదటి రెండు రోజులూ దాదాపు 90 శాతం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మూడో రోజు 67%, శనివారం 25%, ఆదివారం 40 శాతం వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
https://twitter.com/riteshyadav8300/status/1846142558998609979
జట్టు వివరాలు
INDIA: రోహిత్ శర్మ(C), బుమ్రా (VC), జైస్వాల్, గిల్, కోహ్లీ, KL రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, పంత్ (WK), ధ్రువ్ జురెల్(WK), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, సిరాజ్, ఆకాశ్ దీప్.
New Zealand: టామ్ లాథమ్ (C), టామ్ బ్లండెల్, బ్రేస్‌వెల్ (తొలి టెస్టుకు మాత్రమే), చాప్‌మన్, కాన్వే, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఒరుర్కే, అజాజ్ పటేల్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, శాంట్నర్, బెన్ సీర్స్, ఇష్ సోథి (2,3 టెస్టులకు), టిమ్ సౌథి, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.