SRH రిటెన్షన్ లిస్ట్ రెడీ .. జాబితాలో స్టార్ ప్లేయర్స్!

Mana Enadu : 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పలు జట్లకు సంబంధించి రిటైన్ జాబితాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad) చేరింది. తాజాగా SRHకు సంబంధించిన రిటైన్‌ లిస్టు రెడీ అయినట్లు తెలిసింది. 

ఐపీఎల్‌ వేలానికి సంబంధించిన రిటెన్షన్‌ నిబంధనలను ఇటీవల బీసీసీఐ(BCCI) ఖరారు చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టు కోవడానికి పర్మిషన్ ఇచ్చింది. మరి సన్​రైజర్స్ ఫ్రాంచైజీ ఎవరెవరిని అట్టిపెట్టుకునే ఛాన్స్ ఉందంటే?

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్- బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌ను నెక్స్ట్ సీజన్‌కు ఫస్ట్ ఆప్షన్ గా తీసుకోవాలని SRH భావిస్తోందట. తొలి ఆప్షన్‌గా రిటైన్ చేసిన ఆటగాడికి బీసీసీఐ రూ.18 కోట్ల ధరను నిర్ణయించినా సన్ రైజర్స్ యాజమాన్యం మాత్రం క్లాసెన్‌ కోసం రూ.23 కోట్లు చెల్లించడానికి రెడీగా ఉందని తెలిసింది. ఈ ఏడాది ఐపీఎల్ లో క్లాసెన్ అత్యుత్తమ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో సన్ రైజర్స్ కెప్టెన్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్(Pat Cummins).. యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మను రిటైన్ చేయాలని SRH డిసైడ్ అయిందట. కమిన్స్‌ను రూ.18 కోట్లకు.. అభిషేక్ కోసం రూ.14 కోట్లు పెట్టడానికి రెడీ అయిందని సమాచారం. 

ఈ ఏడాది ఐపీఎల్ లో సెంచరీలతో మిగతా టీమ్స్ కు దడ పుట్టించాడు ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (Travis Head). మరోవైపు ఈ సీజన్ లో అద్భుత ప్రదర్శన చేశాడు టీమిండియా యంగ్‌ ఆల్‌ రౌండర్‌ నితీష్ కుమార్ రెడ్డి. ఈ ఇద్దరు ప్లేయర్స్ ను కూడా సన్ రైజర్స్ నెక్స్ట్ సీజన్ కు తమ జట్టులోకి తీసుకోవాలనుకుంటోందట. 

ఈ ఆటగాళ్లను రిటైన్ చేయడానికి సన్‌రైజర్స్‌ దాదాపుగా రెడీ అయినట్లు టాక్. ఇక మిగిలిన స్క్వాడ్‌ను కొనుగోలు చేయడంలో ఈ టీమ్ కాస్త తెలివిగా వ్యవహరిస్తే.. బలమైన జట్టుతో 2025 ఐపీఎల్‌ టైటిల్‌ వేటలో దిగవచ్చని క్రికెట్ నిపుణులు అంటున్నారు.

 

Share post:

లేటెస్ట్