ManaEnadu: సౌతాఫ్రికాపై(South Africa) యంగ్ ఇండియా దుమ్మురేపింది. T20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచులో జూలువిదిల్చింది. వెరసీ సెంచూరియన్(Centurian) వేదికగా జరిగిన మూడో T20లో భారత్ జట్టు(Team India) దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలుత టాస్(Toss) ఓడి బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంజూ ఈ మ్యాచులోనూ డకౌట్ అయ్యాడు. ఈక్రమంలో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(50)కు జత కట్టిన హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ(Tilak Varma) వచ్చీ రాగానే అటాకింగ్‌కు దిగాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో తిలక్ కెరీర్‌లోనే తొలి సెంచరీ(Century) నమోదు చేశాడు. దీంతో భారత్ 219/6 రన్స్ సాధించింది.
చివర్లో జాన్సెన్ మెరుపులు
అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సఫారీలు ఓవైపు వికెట్లు కూలుతున్నా ధాటిగానే ఆడింది. ఎయిడెన్ మార్‌క్రమ్ (29), హెన్రిచ్ క్లాసెన్ (41)ను త్వరగానే ఔట్ చేశారు. దీంతో విజయం ఖాయమని అంతా భావించారు. కానీ చివర్లో ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ ఫోర్సు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో 4, 6, 4, 2, 6, 4 కొట్టి ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. దీంతో భారత్ శిబిరంలో ఆందోళన మొదలైంది. అయితే చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 25 పరుగులు అవసరం కాగా.. కట్టుదిట్టంగా బంతులేసిన అర్షదీప్ సింగ్(Arshdeep Singh) 13 రన్స్ ఇచ్చాడు. దీంతో భారత్ 11 పరుగులతో విజయం సాధించింది. అర్ష్ దీప్ 3, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టారు. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. శతకంతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ ‘PLAYER OF THE MATCH’గా నిలిచాడు. చివరిదైన నాలుగో T20 మ్యాచ్ శుక్రవారం జరగనుంది.
https://twitter.com/Rinu2497/status/1856749793428869500






