
ఇటీవల జమ్మూకశ్మీర్(J&K)లో పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో పాకిస్థాన్(Pakistan)పై భారత్ దౌత్యపరమైన చర్యల(Diplomatic actions)ను ముమ్మరం చేసింది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై పాక్‌ను ఒంటరి చేయడంలో ఆశించిన ఫలితాలు సాధిస్తోన్న భారత్ తాజాగా మరో విషయంలో దాయాదికి షాక్ ఇచ్చింది. ఈ మేరకు పాక్‌కు అందుతున్న అంతర్జాతీయ ఆర్థిక సహాయాన్ని నిలిపివేయించే దిశగా భారత కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, పాకిస్థాన్‌కు అందిస్తున్న ఆర్థిక సహాయా(Financial assistance)న్ని తక్షణమే నిలిపివేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB)ని కోరింది.
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ గ్రే లిస్ట్‌లో..
ఇటీవల జరిగిన ఒక సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) ఈ విషయాన్ని ADB అధిపతి మసటో కండా(Masato Kanda)తో నేరుగా ప్రస్తావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌కు ఆర్థిక సహకారం(Financial assistance to Pakistan) కొనసాగించవద్దని ఆమె స్పష్టంగా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ ఇదివరకే ఇటలీ(Italy) ఆర్థిక మంత్రితో చర్చలు జరిపారని, పలు ఇతర యూరోపియన్ దేశాల(EU)తో కూడా సంప్రదింపులు కొనసాగిస్తున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ గ్రే లిస్ట్(Financial Action Task Force Grey List)లో పాకిస్థాన్‌ను చేర్చేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.