టీమ్ఇండియా మహిళల క్రికెట్( India Women) జట్టు మరోసారి సత్తా చాటింది. సౌతాంప్టన్‌లోని ది రోజ్ బౌల్‌లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్(England)ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇటీవల ఇంగ్లండ్‌పై 3-2 తేడాతో టీ20 సిరీస్‌ను గెలుచుకున్న హర్మన్‌ప్రీత్(Harmanpreet) సేన.. తాజాగా వన్డే సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. అమన్ జ్యోత్(Amanjot Kaur), క్రాంతి(Kranti)ల ధాటికి 20 పరుుగలకే తొలి రెండు వికెట్లను త్వరగా కోల్పోయింది.

రాణించిన పేసర్లు
యువ పేసర్ క్రాంతి గౌడ్ తన రెండో వన్డేలోనే ఎమీ జోన్స్ (1), టామీ ఓపెనర్ టామీ బ్యూమాంట్ (5) వికెట్లను పడగొట్టి సంచలనం సృష్టించింది. అయితే, సోఫియా డంక్లీ (83 నాటౌట్, 92 బంతుల్లో), ఆలిస్ డేవిడ్‌సన్-రిచర్డ్స్ (53, 73 బంతుల్లో) ఐదో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. చివర్లో సోఫీ ఎకల్‌స్టోన్ ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 258/6 స్కోరు సాధించింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా ఒక్కో రెండు వికెట్లు తీశారు.
మరో 10 బంతులు మిగిలి ఉండగానే..
అనంతరం 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు స్మృతి మంధాన (28), ప్రతీకా రావల్ (36) ఓపెనింగ్ భాగస్వామ్యంతో 48 పరుగుల శుభారంభం అందించారు. అయితే, మధ్యలో వికెట్లు కోల్పోయి 124/4తో కష్టాల్లో పడింది. ఈ సమయంలో దీప్తి శర్మ (62 నాటౌట్, 62 బంతుల్లో), జెమీమా రోడ్రిగ్స్ (48) కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను స్థిరపరిచారు. చివర్లో అమన్‌జోత్ కౌర్ (20 నాటౌట్, 14 బంతుల్లో) దీప్తితో కలిసి 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీప్తి శర్మ(Deepti Sharma) తన అద్భుతమైన ఆటతీరుతో ‘Player of the match’ అవార్డు అందుకుంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జులై 19న లార్డ్స్‌లో జరగనుంది.
Deepti Sharma’s 62* guides India over the line to take the series opener!
Their second-highest successful chase in women’s ODIs! 🙌
Scorecard: https://t.co/1GIBevN7Ok pic.twitter.com/gpUXsdd3oV
— ESPNcricinfo (@ESPNcricinfo) July 16, 2025






