ఈసారి గణతంత్ర వేడుకలకు(Republic Day Celebrations) ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో(Indonesian President Prabowo Subianto) హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని కర్తవ్యపథ్(Kartavyapath)లో నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఇండోనేషియాకు చెందిన 160 మంది సైనికుల బృందం, 190 మంది బ్యాండు బృందం భారత సైనికులతో కలిసి కవాతు నిర్వహించనుంది. కాగా ఈ పరేడ్(Parade)లో సాయుధ దళాలు, పారామిలిటరీ ఫోర్సెస్, NSS, NCC, సహాయ పౌర బలగాలు పాల్గొననున్నట్లు భారత రక్షణ శాఖ(Ministry of Defense of India) తెలిపింది.
1950 నుంచి ఇదే సంప్రదాయం
కాగా 1950 నుంచి ఇండియా(India) తన మిత్ర దేశాల నేతలను గణతంత్ర, స్వాతంత్య్ర దినోవ్సవాల సందర్భంగా ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే 1952, 1953, 1966 ఏడాదిలోనే మాత్రమే విదేశీ అతిథులు(Foreign guests) లేకుండా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. కాగా 2024లో గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మెక్రాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
75 ఏళ్లు పూర్తైన సందర్భంగా..
ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో(Prabowo Subianto) ఈసారి గణతంత్ర వేడుకులకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఆయన ఇప్పటికే భారత్ విచ్చేశారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రబోవో సుబియాంటో ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఆ దేశంతో భారత దౌత్యబంధం మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ప్రబోవోను భారత సర్కారు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు చేరుకున్న ఆయన, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ అయి ఇంధన భద్రత, ఆరోగ్య భద్రత, రక్షణ రంగంతో సహా పలు అంశాలపై ఒప్పందం తదితర అంశాలపై చర్చించారు.
India is honoured to welcome President Prabowo Subianto.
When we marked our first Republic Day, Indonesia was the guest nation and now, when we are marking 75 years of India being a Republic, President Subianto will be attending the celebrations. We discussed various aspects of… pic.twitter.com/8YiWA8zlQb
— Narendra Modi (@narendramodi) January 25, 2025








