
భారత సైనికులు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ ద్వారా పాకిస్థాన్(Pakistan)కు గట్టి గుణపాఠం చెప్పామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) స్పష్టం చేశారు. భారత సైనికులు రాత్రికి రాత్రే అద్భుత పరాక్రమం ప్రదర్శించి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం(Destruction of terrorist camps) చేసి చరిత్ర సృష్టించారని కొనియాడారు. సరిహద్దు రహదారుల సంస్థ (BRO) చేపట్టిన పలు ప్రాజెక్టులను ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేవలం ఉగ్ర శిబిరాలనే టార్గెట్ చేశాం..
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, “మన సైనికులు(Army) రాత్రికి రాత్రే అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఉగ్రవాద శిబిరాలపై అత్యంత సాహసోపేతమైన దాడులు చేసి తమ సత్తా చాటారు. ఈ ఆపరేషన్‌లో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, కేవలం ఉగ్ర శిబిరాల(terrorist camps)నే లక్ష్యంగా చేసుకున్నారు” అని వివరించారు.
PM మోదీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు
పహల్గామ్(Pahalgam)లో అమాయక పౌరుల మరణానికి కారణమైన ఉగ్రవాదులనే మట్టుబెట్టామని ఆయన తెలిపారు. దేశ భద్రత(National security)కు విఘాతం కలిగించే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఈ ఆపరేషన్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చిన PM మోదీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack)కి ప్రతిచర్యగా భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరిట మంగళవారం అర్ధరాత్రి తర్వాత మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 100కి పైగా ఉగ్రవాదులు మరణించారు.
भारतीय सेनाओं ने अपने अद्भुत शौर्य और पराक्रम का परिचय देते हुए एक नया इतिहास रच दिया है… pic.twitter.com/enHzYZg50f
— Rajnath Singh (@rajnathsingh) May 7, 2025