భారత్‌లోకి చొరబాటు.. BSF జవాన్ల అదుపులో పాక్ దేశీయుడు

పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ (India-Pakistan) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత సరిహద్దుల్లో పాకిస్థాన్‌ పౌరులు పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ జమ్ముకశ్మీర్‌ (Jammu and Kashmir) లోని పూంచ్‌ జిల్లా (Poonch district) లో నియంత్రణ రేఖ (Line of Control) వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఒక పాకిస్థానీని ఆర్మీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

China enhances military support to Pakistan along LoC in Kashmir | India  News - The Indian Express

పాక్ రేంజర్స్ అదుపులో భారత జవాన్

సోమవారం కూడా పంజాబ్‌(Punjab)లోని గురుదాస్‌పూర్‌ సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడ్డ ఒక పాకిస్థాన్‌ జాతీయుడిని BSF జవాన్‌లు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పంజాబ్‌ పోలీసులకు అప్పగించారు. ఆ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగానే తాజాగా మరో పాకిస్థానీ భారత్‌లో చొరబడ్డాడు. ఇదిలావుంటే ఏప్రిల్‌ 23న ఒక BSF జవాన్‌ను పాకిస్థాన్‌ రేంజర్స్‌(Pakistan Rangers) అదుపులోకి తీసుకున్నారు. కాగా భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ రేపు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్(Mock Drill) నిర్వహిస్తోంది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *