INDvsAUS: కంగారూలనూ కొట్టేస్తారా? నేడు ఆసీస్‌-భారత్ మధ్య తొలి సెమీస్

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో మహా సమరానికి నేడు తెరలేవనుంది. ఎనిమిది జట్లు గత రెండు వారాలుగా అభిమానులకు అలరించగా.. బలమైన జట్లు టైటిల్ వేటకు సిద్ధమయ్యాయి. నేడు దుబాయ్(Dubai) వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా(Ind vs Aus) మధ్య తొలి సెమీఫైనల్(Semis) మ్యాచ్ జరగనుంది. గ్రూప్ స్టేజీలో రెండు అపజయమే లేకుండా సెమీస్ చేరాయి. భారత్ మూడు మ్యాచుల్లో నెగ్గితే, ఆసీస్ రెండు నెగ్గగా, మరోకటి వర్షం కారణంగా రద్దైంది. కాగా ఇప్పటి వరకు ఇరు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో తలపడటం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా రెండు జట్ల బలాబలాలు, బలహీనతలు ఏంటో ఓ లుక్ వేద్దామా..

బలమైన బ్యాటింగ్ లైనప్ భారత్ సొంతం

గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ రోహిత్ సేన(Rohith) విజయం సాధించింది. బలమైన బ్యాటింగ్ లైనప్ భారత్ సొంతం. బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ సహా మిడిలార్డర్ కూడా ఫామ్ ఉండటం సానుకూలాంశం. కానీ, బౌలింగ్‌లో మాత్రం భారత్ కాస్త వీక్‌గానే కనిపిస్తోంది. మహమ్మద్ షమీ(Mohammed Shami) బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లు పడగొట్టాడు. కానీ, ఆ తర్వాత అతను PAK, NZ రెండింటిపై అంతగా ఆకట్టుకోలేపోయాడు. షమీ ఫామ్‌లో లేకపోవడం మైనస్ కాగా.. స్పిన్నర్లు కుల్దీప్, జడేజా, అక్షర్, వరుణ్ టచ్‌లో ఉండటం టీమ్ఇండియా(Team India)కు అనుకూలించనుంది.

బౌలింగ్‌లో వీక్‌గా ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా(Australia) జట్టు ఇప్పటికే కాస్త బలహీనంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే, జోష్ హాజిల్‌వుడ్(Josh Hazlewood), మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్(Pat Cummins) వంటి ప్లేయర్లు గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు. పైగా కంగారూల బౌలింగ్‌లో మునుపటి పదును కనిపించడం లేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు 351 పరుగులు ఇచ్చారు. అయితే, అఫ్గానిస్థాన్ వంటి బలహీనమైన జట్టుపైనా ఆసీస్ బౌలర్లు 273 పరుగులు సమర్పించారు. ఇక బ్యాటింగ్లో మాత్రం స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) వంటి బ్యాట్స్‌మెన్‌లు ఎప్పుడైనా ఆట గమనాన్ని మార్చగలరు.

IND vs AUS, Champions Trophy 2025: Head-To-Head Stats [Source: @uf2151593/x.com]

తుది జట్ల అంచనా..

ఇండియా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, KL రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, వరుణ్ చకరవర్తి

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షియస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *