బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్(Edgbaston) వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్(England)పై 336 పరుగుల తేడాతో ఇండియా(Team India) అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అయింది. ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubham Gill) ఈ మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 269, రెండవ ఇన్నింగ్స్‌లో 161 పరుగులతో రాణించి, ఇండియా భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 587, రెండవ ఇన్నింగ్స్‌లో 427/6 డిక్లేర్ చేసి ఇంగ్లండ్‌కు 608 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
10 వికెట్లతో సత్తా చాటిన ఆకాశ్ దీప్
ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు చేసింది, కానీ రెండవ ఇన్నింగ్స్‌లో 271 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియా బౌలర్ ఆకాశ్ దీప్(Akashdeep) రెండవ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో సత్తా చాటాడు. మొత్తంగా మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్(Mahammad Siraj)కూడా కీలక వికెట్లు తీసి విజయంలో భాగస్వామ్యం వహించాడు. రవీంద్ర జడేజా(Ravindra Jadeja) 89 పరుగులతో బ్యాటింగ్‌లో, వికెట్‌తో బౌలింగ్‌లో రాణించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ యువ నాయకత్వం, ఆకాశ్ దీప్ బౌలింగ్ ప్రతిభ ఇండియాకు ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి టెస్ట్ విజయాన్ని అందించాయి. ఈ విజయం గిల్‌కు కెప్టెన్‌గా తొలి టెస్ట్ విజయంగా నిలిచింది, అతడు 25 ఏళ్ల 301 రోజుల వయసులో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడైన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.






