ManaEnadu: ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Champions Trophy) 2024లో టీమ్ఇండియా(Team India) దుమ్మురేపింది. చైనా(Chaina)తో జరిగిన ఫైనల్(Final)లో భారత్ ఘనవిజయం సాధించింది. చైనా గోడను బద్దలు కొట్టి రికార్డు స్థాయిలో ఐదో కాంటినెంటల్ టైటిల్‌ను టీమ్ఇండియా కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన తుది పోరులో హర్మన్ ప్రీత్(Harmanpreet) సేన 1-0 గోల్స్ తేడాతో చైనాను మట్టికరిపించింది. తొలి మూడు కార్వర్ట్స్‌లోనూ ఇరు జట్టు పోటాపోటీగా తలపడ్డాయి. దీంతో ఒక్క గోల్(Goal) కూడా నమోదు కాలేదు. భారత ప్లేయర్ల జోరును చైనా బలమైన డిఫెన్స్‌తో అడ్డుకుంది. అయితే జుగ్‌రాజ్ సింగ్ 50వ నిమిషంలో గోల్ కొట్టి టీమ్ఇండియాను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అనంతరం అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ చైనా అటాకింగ్‌ను అడ్డుకొని మ్యాచ్‌ను ముగించింది. దీంతో భారత్ సంబరాల్లో మునిగిపోయింది.
టోర్నీలోనే అత్యంత విజయమంతమైన జట్టుగా భారత్
ఇదిలా ఉండగా భారత్ ఆసియా హాకీ(Hockey) ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో మరో రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా టైటిల్(Title) నెగ్గింది. దీంతో ఈ టోర్నీలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. కాగా సోమవారం జరిగిన సెమీఫైన(Semis)ల్లో హర్మన్ ప్రీత్ సేన కొరియాను 4-1 గోల్స్‌తో చిత్తు చేసి ఫైనల్ చేరింది. అటు భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(Pakistan)పై పెనాల్టీ షూటౌట్‌లో చైనా గెలుపొంది ఫైనల్ చేరింది. తాజాగా ఫైనల్లో చైనా భారత్ చేతిలో పరాజయం పాలైంది. కాగా ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)లోనూ భారత్ కాంస్య పతకం కొల్లగొట్టిన విషయం తెలిసిందే.








