Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు కొత్త కోచ్.. ఎవరో తెలుసా?

ManaEnadu: IPL ఎలాగైనా తమ రాత మార్చుకోవడానికి పంజాబ్ కింగ్స్(PK) ఫ్రాంఛైజీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. వచ్చే సీజన్ కోసం మరోసారి హెడ్ కోచ్‌ను మార్చేసింది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌(Ricky Ponting)కు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ ట్విటర్‌లో ప్రకటించింది. ‘పంటర్(పాంటింగ్) ఈజ్ పంజాబ్! మా కొత్త హెడ్‌ కోచ్(Head coach) పదవిలో పాంటింగ్ జాయిన్ అయ్యారు’ అని పేర్కొంది. గడచిన 7 సీజన్లలో ఆ జట్టు ఆరుగురు కోచ్‌లను మార్చడం గమనార్హం. కాగా పాంటింగ్ ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌గా పనిచేశారు.

 పంజాబ్ కోచ్‌గా రావడం ఆనందంగా ఉంది: పాంటింగ్‌

కాగా IPLలో పంజాబ్ కింగ్స్ జట్టు ప్రదర్శనపరంగా, సిబ్బంది ఎంపిక పరంగా అస్థిరతకు మారుపేరుగా నిలుస్తోంది. వచ్చే సీజన్‌కు రికీ పాంటింగ్‌ను నియమించిన ఆ జట్టు గత 7 సీజన్లలో ఆరుగురు కోచ్‌లను మార్చింది. ఆ టీమ్ ప్రదర్శన చూస్తే.. ఐపీఎల్ చరిత్రలో కేవలం 2సార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌(Playoffs)కు వెళ్లింది. గత పదేళ్లలో అయితే ఒక్కసారీ ప్లేఆఫ్ గడప తొక్కలేదు. ఈ ఏడాది 9వ స్థానంలో నిలిచింది. వచ్చే సీజన్‌లో సరికొత్త పంజాబ్ కింగ్స్(Punjab Kings) టీమ్‌ను చూపేందుకు ప్రయత్నిస్తానని ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నారు. ‘పంజాబ్ కోచ్‌(Punjab Coach)గా రావడం ఆనందంగా ఉంది. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు నేనెప్పుడూ సిద్ధమే’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ‘పాంటింగ్‌తో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మా జట్టును పవర్‌ఫుల్‌గా మార్చేందుకు ఆయన శ్రమిస్తారని ఆశిస్తున్నాం’ అని పంజాబ్ మేనేజ్‌మెంట్ పేర్కొంది.

IPLలో పాంటింగ్ ఇలా..

ఐపీఎల్లో ఓ ప్లేయర్ గా రికీ పాంటింగ్ కేవలం రెండు సీజన్లలో మాత్రమే ఆడాడు. 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) తరఫున, 2013లో (MI) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్లో ముంబైకి కెప్టెన్ గా ఉన్నా కూడా మధ్యలోనే తప్పుకొని రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించారు. అదే ఏడాది అన్ని ఫార్మాట్లకు పాంటింగ్ గుడ్ బై చెప్పాడు. అయితే MI జట్టుకు మాత్రం సలహాదారుగా కొనసాగాడు. ఆ తర్వాత 2015, 2016లలో అదే ఫ్రాంఛైజీ హెడ్ కోచ్ గా కూడా పని చేశాడు. 2017 నుంచి DCతోనే ఉన్నాడు. 2018లో ఆ ఫ్రాంఛైజీ హెడ్ కోచ్ అయ్యాడు. ఆ తర్వాత 2019 నుంచి 2021 వరకు అతని కోచింగ్ లోనే ఆ ఫ్రాంఛైజీ వరుసగా మూడుసార్లు ప్లేఆఫ్స్ చేరింది. 2020లో ఫైనల్ వచ్చినా ట్రోఫీ గెలవలేకపోయింది. ఈ ఏడాది జులైలో DC నుంచి అతడు తప్పుకున్నాడు.

Share post:

లేటెస్ట్