ManaEnadu: టీమ్ఇండియా, బంగ్లాదేశ్(IND VS BAN) మధ్య టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియంలో రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 258 రోజుల తర్వాత రోహిత్(Rohit), కోహ్లీ(Kohli), బుమ్రా(Bumrah) కలిసి టెస్టు ఆడనుండటం విశేషం. ఈ మ్యాచ్‌లో గెలిచి ఓవరాల్ ఓటముల కన్నా గెలుపుల సంఖ్య పెంచాలని టీమ్ ఇండియా(Team India) భావిస్తోంది. మరో వైపు పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేసిన ఊపులోనే భారత్‌పై కూడా గెలవాలని బంగ్లా తహతహలాడుతోంది. మరోవైపు టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి గౌతమ్ గంభీర్(Gautam Gambhir)కూ ఇదే తొలి టెస్ట్ సిరీస్. దీంతో భారత జట్టును గంభీర్ ఎలా మేనేజ్ చేస్తారో అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ప్రయోగాలు కొనసాగేనా?
ఇటీవల శ్రీలంక(Srilanka) సిరీస్‌లో గంభీర్ కోచింగ్ బాధ్యతలు అందుకున్నారు. అయితే ఆ టూర్‌లో గౌతీకి అంతగా కలిసి రాలేదు. సూర్యకుమార్(SKY) కెప్టెన్సీలో T20 సిరీస్‌ను 3-0తో గెలిస్తే, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ODI సిరీస్ ను 0-2తో కోల్పోయింది. దీంతో గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వన్డే సిరీస్‌లో గంభీర్ చేపట్టిన ప్రయోగాలు బెడిసికొట్టాయి. టాప్ ఆర్డర్‌ను, బౌలర్లను మార్చాడు. బ్యాట్స్‌మెన్లతోనూ బౌలింగ్ వేయించారు. ఈనేపథ్యంలో బంగ్లాదేశ్‌పై ఎలాంటి ప్రయోగాలు చేస్తారోనని క్రీడా విశ్లేషకులతోపాటు అభిమానులూ ఎదురుచూస్తున్నారు. అయితే WTC ఫైనల్ చేరాలంటే బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టుపై గెలిచి పాయింట్లు పెంచుకోవాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు.
రెండు ప్రపంచకప్‌లలోనూ కీలక ప్లేయర్
గౌతమ్ గంభీర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టీమ్ఇండియా T20 ప్రపంచకప్, ODI ప్రపంచకప్ గెలిచిన రెండు సందర్భాల్లోనూ అతడు జట్టులో ఉన్నాడు. అంతేకాదు ఆ రెండు టోర్నీల్లోనూ కీలక ఇన్నింగ్సులతో అలరించాడు. ఇక IPLలో కోల్‌కతా కెప్టెన్‌గా, మెంటార్‌గానూ ఆ జట్టుకు టైటిల్స్ అందించాడు. మరిప్పుడు కోచ్(Coach)గా ఎలా రాణిస్తాడోనని సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. మరోవైపు ఇప్పటికీ రెండుసార్లు WTC ఫైనళ్లు ఆడిన టీమ్ఇండియా రెండుసార్లూ కంగుతింది. ఈ సారైనా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది.
జట్ల అంచనా
IND Probable XI: రోహిత్ శర్మ (C), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (WK), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్/మహ్మద్ సిరాజ్
BAN Probable XI: షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (C), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్ (WK), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా