పుష్ప-2 గ్రాండ్ సక్సెస్‌తో ఫుల్ ఖుషీలో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun). ఇక అదే జోష్‌లో మరో ప్రాజెక్టును పట్టాలెకిస్తున్నాడు. జులాయి, S/o సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత బన్నీ-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Director Trivikram Srinivas) కాంబోలో మరో మూవీ రానున్న సంగతి తెలిసింది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? రిలీజ్ ఎప్పుడవుతుంది? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ-త్రివిక్రమ్ మూవీ(Bunny-Trivikram movie)పై ఓ క్రేజీ గాసిప్ వినిపిస్తోంది.
రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాకే..
ప్రస్తుతం అల్లు అర్జున్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. పుష్ప-2(Pushpa2)కోసం దాదాపు రెండేళ్లుగా వర్క్ చేసిన ఆయన కాస్త ఫ్రీ టైం తీసుకొని ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్‌తో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు బన్నీ. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే నెలలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే, ఫస్ట్ షెడ్యూల్‌లో బన్నీ పాల్గొనడం లేదని, రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాక.. జూన్ నుంచి బన్నీ షూట్‌లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది.

మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్-బన్నీ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసిన ఈ మూవీని హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్(Geetha Arts) సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్(Thaman) మ్యూజిక్ అదించబోతున్నాడు. ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.






