దావోస్‌లో తెలంగాణ పెవిలియన్.. ఒకే రోజు రాష్ట్రానికి రూ.56,300 కోట్లు

దావోస్‌లో తెలంగాణ పెవిలియన్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అండ్ టీమ్ రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తోంది. ఇప్పటికే రూ.62వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ఇక బుధవారం రోజున రికార్డు స్థాయిలో ఏకంగా రూ.56,300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపాయి.

విప్రో ఛైర్మన్ తో సీఎం రేవంత్

దావోస్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా విప్రో (Wipro) ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీతో అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబు ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో కొత్త సెంటర్‌ ఏర్పాటుకు విప్రో అంగీకారం తెలిపింది.

హైదరాబాద్ లో విప్రో కొత్త సెంటర్

మూడేళ్లలో ఈ సెంటర్‌ పూర్తి చేస్తామని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ తెలిపారు. విప్రో కొత్త సెంటర్‌ (Wipro Jobs) ద్వారా 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు వెల్లడించారు. ఇలా దావోస్ లో తెలంగాణ పెవిలియన్ కొనసాగుతూ రాష్ట్రానికి పెట్టుబడులు, రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకువస్తోంది. గతేడాది పర్యటనలో రాష్ట్రానికి ఏకంగా రూ.40వేల కోట్ల పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే.

సన్ పెట్రో కెమికల్స్ రూ.45వేల కోట్లు

బుధవారం రోజున సన్ పెట్రో కెమికల్స్ (Sun Petro Chemicals) రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయూ కుదుర్చుకుంది. మరోవైపు కంట్రోల్ ఎస్ కంపెనీ తెలంగాణతో రూ.10వేల కోట్ల పెట్టుబడికి సంబందించి ఎంవోయూ చేసుకుంది. జేఎస్​డబ్ల్యూ (JSW) కంపెనీ రాష్ట్రంలో రూ.800 కోట్లతో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకు రాగా.. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థతో కలిసి యూనిట్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *