ముంబయి నటి జత్వానీ కేసు.. ఐపీఎస్‌ సీతారామాంజనేయులు అరెస్ట్

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో ముంబయి నటి కాదంబరీ జత్వానీ కేసు (kadambari jethwani case) పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. జత్వానీ వేధింపుల కేసులో ఏపీ సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్‌ అధికారి సీతారామాంజనేయులు(IPS Seetharamanjaneyulu)ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో సీతారామాంజనేయులు ఏ2గా ఉన్నారు.

అంతా తానే ఇప్పుడు అరెస్టయి

ఇప్పటికే ఈ వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ విశాల్ గున్నితో పాటు ఆంజనేయలు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. జగన్‌ హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌(Intelligence Chief)గా పని చేసిన సీతారామాంజనేయులు నటి జత్వానీ వేధింపుల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ముఖ్య నేత చెప్పగానే రంగంలోకి దిగిన ఆంజనేయులు ముంబయి నటిపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్టు చేయాలో ప్లాన్ రెడీ చేసుకున్నారు.

అందరూ కుమ్మక్కై 

కూటమి సర్కార్ (AP Govt) ఏర్పడిన తర్వాత నటి కాదంబరీ జత్వాని పోలీసులపై, కుక్కల విద్యాసాగర్ పై 2024 ఆగస్టులో ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసులో తనతోపాటు తన తల్లిదండ్రులను జైలు పాల్జేశారని అందులో పేర్కొన్నారు . నటి ఫిర్యాదు మేరకు విద్యాసాగర్‌తో పాటు ముగ్గురు ఐపీఎస్‌లపై విజయవాడలో కేసు నమోదు కాగా..  ఏ1గా విద్యాసాగర్, ఏ2గా పి.సీతారామాంజనేయులు (పీఎస్‌ఆర్‌), ఏ3గా కాంతిరాణా, ఏ4గా వెస్ట్‌జోన్‌ పూర్వ ఏసీపీ హనుమంతురావు, ఏ5గా ఇబ్రహీంపట్నం పూర్వ సీఐ సత్యనారాయణ, ఏ6గా విశాల్‌గున్నీ పేర్లను పోలీసులు చేర్చారు. విద్యాసాగర్‌తో అధికారులు కుమ్మక్కై కాదంబరీ జెత్వానీని అక్రమంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *