
నీ అవ్వ తగ్గేదేలే.. ఈ డైలాగ్‌ను చాలా మంది పుష్ప సినిమాలో వినే ఉంటారు. ఇప్పుడు ఇదే డైలాగ్ బంగారం ధరల(Gold Rates)కు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే రోజురోజుకీ అందనంత ఎత్తుకు పసిడి రేటు పరుగులు తీస్తోంది. దీంతో సామాన్యుడి ‘బంగారు’ కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. వారం క్రితం స్వల్పంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ఇప్పుడు గత రికార్డులను బద్దలుకొడుతూ ఆల్ టైం హైయెస్ట్ ధరలను నమోదు చేస్తున్నాయి. దేశంలో గడిచిన 3 రోజుల్లో చూస్తే 2 వేలకి పైగానే పెరిగింది. ప్రస్తుతం పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. ఇక ఇవాళ (ఏప్రిల్ 22) బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా..
ఈ ధరలు ఎలా ఉన్నాయంటే..
కాగా మంగళవారం హైదరాబాద్(HYD)లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,750 పెరిగి రూ.92,900కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,649 పెరిగి రూ.99,999కి చేరి ఆల్‌టైమ్ గరిష్ఠ ధర పలుకుతోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇక బంగార కొన్నట్లే అంటూ షాకవుతున్నారు. ఇక కేజీ సిల్వర్(Silver Price) ధర రూ.1,11,000గా నమోదైంది.