
మరో భారీ ప్రయోగానికి ఇస్రో(ISRO) సిద్ధమైంది. రేపు (జనవరి 29)న శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(SHAAR) నుంచి ఉదయం 6.23 గంటలకు 100వ రాకెట్‌ను ప్రయోగించనుంది. GSLV-F15 మిషన్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని స్పేస్‌లోకి పంపనుంది. భారత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ(Indian Satellite Navigation System)ను బలోపేతం చేయడం ఈ GSLV F-15 NVS-02 మిషన్ లక్ష్యం. జీఎస్‌ఎల్‌వీ-15 రాకెట్‌తో NVS ఉపగ్రహం అనుసంధాన ప్రక్రియ పూర్తైందని, కౌంట్ డౌన్ కూడా ప్రారంభించినట్లు ఇస్రో తెలిపింది.
దేశ నావిగేషన్ సేవలను మెరుగుపరుస్తుంది..
SHAARలోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈ ఉపగ్రహం సెకండ్ జెనరేషన్ శాటిలైట్ కాగా.. NVS-01 ఉపగ్రహాన్ని 29 మే 2023న ఇస్రో నింగిలోకి పంపింది. NVS-02 ఉపగ్రహం NVS సిరీస్‌లో రెండోవది. జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) తన 17వ విమానంలో 2250KM వ్యోమనౌకను మోసుకెళ్తుంది. ఇది భారతదేశ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (NavIC) సిస్టమ్‌లో భాగమవుతుంది. దేశ నావిగేషన్ సేవలను మెరుగుపరుస్తుంది.
కొత్తతరం నావిగేషన్ ఉపగ్రహాలలో రెండోది
స్వదేశీ క్రయోజెనిక్(Cryogenic) దశతో కూడిన GSLV-F15 శ్రీహరికోట నుంచి ప్రయోగించిన తర్వాత NVS-02 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ఉంచుతుంది. ఇండియా కొత్తతరం నావిగేషన్ ఉపగ్రహాలలో రెండవ ఉపగ్రహం NVS-02. ఇది నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (NavIC) వ్యవస్థలో ఇది భాగం. ఈ GSLV-F15 రాకెట్ 420.7 బరువు టన్నులు కాగా లిఫ్ట్-ఆఫ్ ద్రవ్యరాశితో మూడు దశలను కలిగున్న 50.9 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ వందవ ప్రయోగంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.