మన Enadu: ఓరుగల్లు కాకతీయుల ఘనకీర్తికి నిలువుటద్దంగా నిలిచిన వెయ్యికాళ్ల మండపాన్ని 18 ఏండ్ల తర్వాత మహా శివరాత్రివేళ కేంద్ర టూరిజం మంత్రి కిషన్‍రెడ్డి రుద్రేశ్వరునికి పూజలు నిర్వహించి ప్రారంభించనున్నారు.
సాండ్ బాక్స్ టెక్నాలజీ
ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చిన వెయ్యిస్తంభాల గుడిలోని కల్యాణ మండపాన్ని పున:నిర్మాణంలో శిల్పులు.. నాటి కాకతీయుల సాండ్ బాక్స్ టెక్నాలజీనే వాడారు. ఎక్కడా కూడా సిమెంట్, కాంక్రీట్, ఐరన్ వాడలేదు. ఇసుక ఆధారంగానే మళ్లీ నిలబెట్టారు. మండపం తొలగించిన అడుగు భాగంలో 3 మీటర్ల లోతు పునాది తవ్వారు. దానిలో రేగడి మట్టి నింపారు. గ్రానైట్, ఇటుక, కరక్కాయ, బెల్లంతో చేసిన మిశ్రమంతో క్యూరింగ్ చేశారు. ఆపై ఇసుక బేస్‍మెంట్‍పై రాళ్లు, స్తంభాలు నిలబెట్టారు. భూకంపాలు, తుఫాన్ వంటి విపత్తులు వచ్చినాపడకుండా రాళ్ల మధ్య స్టెయిన్‍లెస్ స్టీల్ పట్టీలతో నిర్మాణం చేశారు.
ఓరుగల్లు కాకతీయుల పాలనలో ఒకటో రుద్రుడు 1163లో వెయ్యిస్తంభాలగుడిని నిర్మించాడు. 1400 మీటర్ల వైశాల్యంలో.. శివుడు, కేశవుడు, సూర్యుడు ఒకే దగ్గర పూజలందుకునే ఆలయం ఇది. అందుకే దీనిని త్రికూటాలయంగా చెబుతారు. ఇక్కడి ప్రతి రాయి లయబద్ధమైన సంగీతం అందించేది. శిలలపై సప్తస్వరాలు పలికించిన ఘనత నాటి కళాకారులకు దక్కింది.
ఇప్పటిలా సైన్స్ అండ్ టెక్నాలజీ, టన్నులకొద్ది బరువులెత్తే క్రేన్లు అందుబాటులో లేకున్నా దీనిని 1000 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా నిర్మాణాలు చేశారు. .. తుగ్లక్ సేనలు వీటిని పడగొట్టేలా దండయాత్రలు చేసినా పడిపోకుండా.. డంగు సున్నం, కరక్కాయ పొడి, బెల్లం, ఇటుక పొడి వంటి మిశ్రమాలను వాడారు అప్పట్లో వర్షాల కారణంగా కల్యాణ మండపంలోని కొన్ని పిల్లర్లు కుంగాయి తప్పితే.. శిల్ప సంపద దెబ్బతినలేదు.