కోలీవుడ్ నటుడు దళపతి విజయ్ (Vijay) హీరోగా రూపొందిస్తున్న చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan). పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయిక. హెచ్.వినోద్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇకపై పూర్థిస్థాయి రాజకీయాలపై దృష్టిసారించనున్న విజయ్ ఇకపై సినిమాల్లో నటించరని.. ఆయన చివరి చిత్రం ఇదేనంటూ గత కొంతకాలంగా కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతో జన నాయగన్పై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం విజయ్ పుట్టినరోజును పురస్కరించుకొని చిత్రబృందం తాజాగా ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది. ‘ది ఫస్ట్ రోర్’ అని పేర్కొంటూ పంచుకుంది. ఇందులో విజయ్ పోలీస్ లుక్‌లో పవర్‌లఫుల్‌గా కనిపించారు. విజయ్ 69వ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.






