
టీమిండియా(Team India) స్టార్ పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) మైదానంలో తన ప్రదర్శనతోనే కాకుండా, మైదానం బయట తన వ్యక్తిగత విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా, ప్రముఖ గాయని ఆశా భోస్లే(Asha Bhosle) మనవరాలు జనాయ్ భోస్లే(Janai Bhosle)తో కలిసి రాఖీ(Rakhi) పండుగను జరుపుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది.
నెటిజన్ల నుంచి సానుకూల స్పందన
గతంలో సిరాజ్, జనాయ్ డేటింగ్(Dating)లో ఉన్నారంటూ కొన్ని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ వదంతులకు తెరదించుతూ, తమ మధ్య ఉన్నది అన్నాచెల్లెలి బంధమేన(Brother and Sister Relationship)ని వారు ఈ రాఖీ పండుగతో స్పష్టం చేశారు. జనాయ్ ఆప్యాయంగా సిరాజ్‌కు రాఖీ కడుతున్న వీడియోను సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. సహచర క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) కూడా లవ్ ఎమోజీతో స్పందించి తన శుభాకాంక్షలు తెలిపాడు.
ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన మియాభాయ్
ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటన(England Tour)లో సిరాజ్ అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. మొత్తం 23 వికెట్లు పడగొట్టి, సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) కేవలం మూడు టెస్టులకే పరిమితమైన నేపథ్యంలో, సిరాజ్ భారత బౌలింగ్ దాడికి నాయకత్వం వహించాడు. అతని నిలకడైన ప్రదర్శనతో భారత్ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
View this post on Instagram