గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు ‘RC16’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో చెర్రీ కొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) పాత్రకు సంబంధించి లుక్ టెస్టు జరిగింది. మేకర్స్ ఇటీవలే దీనికి సంబంధించి వీడియో రిలీజ్ చేశారు.
Wishing you a very Happy Birthday #janhvikapoor Loved working with you and I can’t wait for everyone to see your terrific character on screen🔥 #RC16 pic.twitter.com/t0bbBtWaiO
— BuchiBabuSana (@BuchiBabuSana) March 6, 2025
RC16 జాన్వీ పోస్టర్ రిలీజ్
ఇక తాజాగా RC16 నుంచి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ జాన్వీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా RC16 మేకర్స్ ఓ సర్ ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో జాన్వీ పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. చేతిలో మేక పిల్లను పట్టుకొని ఉన్న స్టన్నింగ్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో జాన్వీ చాలా క్యూట్ గా కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
All set for #RC16 @NimmaShivanna is in beast mode for RC16 #RamCharanRevolts@BuchiBabuSana pic.twitter.com/MkVUzbuqO4
— gracegod©️ (@Global_fan22) March 4, 2025
మార్చి 27న టైటిల్ అనౌన్స్మెంట్
ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు (Jagapatibabu), దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ రామ్ చరణ్ పుట్టినరోజు అయిన మార్చి 27వ తేదీన ఉంటుందని సమాచారం.






